టీఆర్‌ఎస్‌కు షాక్‌.. మున్సిపల్‌ చైర్మన్‌ గుడ్‌బై | Adibatla Municipal Chairman Praveen Goud Joins In Congress | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు షాక్‌.. మున్సిపల్‌ చైర్మన్‌ రాజీనామా

Published Mon, Dec 28 2020 3:19 PM | Last Updated on Mon, Dec 28 2020 6:27 PM

Adibatla Municipal Chairman Praveen Goud Joins In Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించిన షాక్‌ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. గతకొంతగా ఆ పార్టీ నాయకత్వ తీరుతో​ తీవ్రంగా విభేదిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ కొత్త ఆర్తిక ప్రవీణ్‌ గౌడ్‌ సోమవారం రాజీనామా సమర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ప్రవీణ్‌ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా  ఆ పార్టీ నేతలతో విభేదించిన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. (మేయర్‌ ఎన్నిక.. కార్పొరేటర్లకు 5కోట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement