సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల్లో డబ్బులు వస్తాయన్న ఆశతో 6.25 లక్షల మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మూడు నెలలవుతున్నా ఇంతవరకు చెల్లింపులు చేయకపోవడం దారుణమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రబీ ధాన్యం కొనుగోళ్ల కింద 3.5 లక్షల మంది రైతులకు రూ.1,900 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోతే రైతులు ఖరీఫ్ ఎలా సాగుచేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల కింద వాడుకునేందుకు 4 రోజుల్లో ఆ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయాలని కోమటిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment