
నల్లగొండ: దేశాన్ని ప్రధాని మోదీ హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నల్లగొండలో ముస్లింలతో కలసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల సభలో కోమటిరెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాల కాలంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ముస్లింలకు 4 శా తం రిజర్వేషన్లు కల్పించడంతో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment