సాక్షి, నల్లగొండ: కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, మెదక్‌లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్ గెలవలేదని జోస్యం చెప్పారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి బుధవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. మేము గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఒక్కరు కూడా మిగలరు. మూడు నెలల్లో బీఆర్‌ఎస్ కనుమరుగవుతుంది. మెదక్‌లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్‌ఎస్ గెలవలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుంది.
కేసీఆర్ కూతురు అవినీతి చేసి తీహార్ జైలులో ఉన్నారు. బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్తారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నారు. శంషాబాద్‌లో ఫామ్ హౌస్ కూడా కొన్నాడు. జగదీష్ రెడ్డి అవినీతిని బయటకు తీస్తాం. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment