రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
Published Tue, Jan 31 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
శిరివెళ్ల: 18వ జాతీయ రహదారిపై శిరివెళ్ల మెట్ట గ్యాస్ గోడౌన్ వద్ద సోమవారం సాయంత్రం కారు అదుపుతప్పి బోలా్త పడింది. ఈఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆదోనికి చెందిన బలిజ మహేంద్రనా«థ్ (38), ఉమాలు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరు కారులో తిరుపతికి పోయి తిరిగి వస్తుండగా గ్యాస్‌గోడౌన్ వద్ద వీరి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభానికి ఢీకొని బోల్తాపడింది. గమనించిన చుట్టుపక్కల వారు కారులో ఇరుక్కున ఇరువురిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో నంద్యాలకు తరలించారు.
తీవ్ర గాయాలైన మహేంద్రనాథ్ కోలుకోలేక ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. ఉమా అనే మహిళ చికిత్స పొందుతుంది. మృతుడు మహేంద్రనాథ్ ఆదోనిలోని నారాయణ ఈ–టెక్నో స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా గాయపడిన ఉమ తిరుపతిలోని శ్రీ చైతన్య స్కూల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడికి వివాహమైందని, కుటుంబసభ్యుల వివరాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు
Advertisement
Advertisement