జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
Published Fri, Sep 23 2016 2:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై భారీగా చేరిన వరదనీరు చేరింది. మధ్యాహ్నం నుంచి వరద నీరు నల్లవాగు వంతెనపైకి చేరటంతో సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరో 3 గంటల వరకు వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ట్రాఫిక్ నిలిచిపోవటంతో బస్సులు, జీపులు, కార్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Advertisement