
పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుని
యువకుడి ఆత్మహత్య
అడ్డగుట్ట: పోలీస్‌స్టేషన్ నుంచి పారిపోయిన ఓ యువకుడు మారేడుపల్లిలోని స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..వెస్ట్ మారేడుపల్లికి చెందిన మహేష్‌గౌడ్(22) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న రేతిఫైల్ బస్టాండ్ వద్ద ఒక ఆటోలో సీటు కింద ఉన్న రూ. 20 వేలను తన స్నేహితుడు ఆజామ్‌తో కలిసి దొంగలించాడు. దీనిపై ఆటో యజమాని సుందర్‌ప్రసాద్ గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా మహేష్, ఆజామ్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. శుక్రవారం రాత్రి స్టేషన్‌నుంచి పారిపోయిన మహేశ్ అర్థరాత్రి మారేడుపల్లిలోని స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థాని కులు గుర్తించి తుకారాంగేట్ పోలీసులకు సమాచారం అందించగా మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనతంరం మృత దేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. గోపాలపురం పోలీసుల వేధింపుల కారణంగానే మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.