భక్తుల ముసుగులో వచ్చిన బయటి వ్యక్తులే కిరీటాలను దొంగిలించుకెళ్లినట్టు గుర్తించారు. అర్చకులు గర్భాలయంలో లేని సమయంలో చోరీ జరిగినట్టు తేల్చారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆలయంలోకి దొంగలు పడ్డారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.