Shocking CCTV Footage: US Man Shared Video Of Unknown Woman Secretly Living In A Cupboard - Sakshi

వైరల్‌: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు

Jun 2 2021 11:06 AM | Updated on Jun 3 2021 8:49 AM

CCTV Reveals Unknown Woman Secretly Living In A Cupboard In New York - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా సీసీటీవీల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం నేరాలను వీలైనంత తొందర్లోనే పోలీసులు చేధిస్తున్నారు. అయితే చాలా చోట్ల ఎవరికి వారు వ్యక్తిగత పర్యవేక్షణ కోసం ఇంట్లో, షాపుల్లో, పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఇప్పటిది కాదు..12 ఏళ్ల క్రితం నాటిది. న్యూయార్క్‌కు చెందిన జో కమ్మింగ్స్ 2009 లో పంచుకున్న ఒక భయంకరమైన వీడియో మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్‌ చేస్తోంది.

కమ్మింగ్స్‌ తన ఇంట్లో వస్తువులను ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే తన ప్రేయసిపై అనుమానంతో..తనను ఆటపట్టించడానికి ఓ సీసీటీవీని ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల తర్వాత కమ్మింగ్స్ ఫుటేజీని చూసి షాక్‌ తిన్నాడు. ఓ మహిళ తన అల్మరాలో రహస్యంగా నివసిస్తున్నట్లు, తన ఆహారాన్ని దొంగిలించి, కిచెన్ సింక్‌లో మూత్ర విసర్జన చేస్తున్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. అయితే 12 సంవత్సరాల తర్వాత సోషల్ మీడియాలో తిరిగి కనిపించిన ఈ వీడియో నెటిజన్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది.



(చదవండి: Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement