పోలీసులు విడుదల చేసిన అనుమానితుడి ఫోటో
సాక్షి, తిరుపతి: భక్తుల ముసుగులో వచ్చిన బయటి వ్యక్తులే కిరీటాలను దొంగిలించుకెళ్లినట్టు గుర్తించారు. అర్చకులు గర్భాలయంలో లేని సమయంలో చోరీ జరిగినట్టు తేల్చారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆలయంలోకి దొంగలు పడ్డారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
టీటీడీ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో గోవిందరాజస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శనివారం మూడు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. చోరీ వెనుక అర్చకులు, సిబ్బంది ప్రమేయం ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో వారి ప్రమేయం లేకపోవచ్చనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. అయినా కూడా ఆ రోజు ఆలయంలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరి కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కొంతమంది అనుమానితులను గుర్తించారు. అందులో భాగంగా ఒక ఆటో డ్రైవర్, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరింత లోతుగా విచారించిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ బయటి వ్యక్తులే భక్తుల ముసుగులో ఆలయంలోకి చొరబడి కిరీటాలు ఎత్తుకెళ్లినట్టు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు సీసీ ఫుటేజిలను పరిశీలించి అనుమానితుడిని గుర్తించారు. అం దులో భాగంగా సోమవారం రాత్రి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అనుమానితుడి ఫో టోను విడుదల చేశారు. చోరీకి పాల్పడ్డ వారి కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన ట్టు ఎస్పీ వెల్లడించారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తె లిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించారు. అయితే ఆటో డ్రైవర్‌తో పాటు తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.
కాల్‌డేటా ఆధారంగా విచారణ ముమ్మరం
చోరీ జరిగిన రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ ఆధారంగా కాల్‌డేటాను పరిశీలిస్తున్నా రు. దొంగతనానికి పాల్పడ్డ వారి ఆచూకీ కోసం పోలీ సు బృందాలు వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లా రు. కాల్‌డేటాను సేకరించిన పోలీసులు వాటి ఆధా రంగా గాలింపు చేపట్టారు. ఈ మేరకు పోలీసు బృం దాలు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లారు. దొంగల ను కాల్‌డేటా పట్టిస్తుందనే పోలీసులు భావిస్తున్నా రు. గర్భాలయం ముందు ఉన్న సీసీ కెమెరా గత కొన్ని రోజులుగా పనిచేయకపోవటానికి గల కారణా లపైనా కూపీ లాగుతున్నారు. అర్చకుల్లో రెండు వర్గా లు ఉండటంతో విచారణకు సహకరించటం లేదనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించాలని జేఈఓ అర్చక బృందాలను కోరినట్టు తెలిసింది.
అర్చకులు లేని సమయంలోనే..
గోవిందరాజస్వామి గర్భాలయం, సమీపంలో విధులు నిర్వహించాల్సిన అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కిరీటాలు చోరీకి గురైన స మయంలో అర్చకులు గర్భాలయంలో లేరని తెలిసింది. ఇదే అదనుగా చూసి ఉత్సవమూర్తులకు అలంకరించి ఉన్న మూడు కిరీటాలను అపహరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అర్చకులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. గోవిందరాజస్వామి గర్భాలయంలో విధులు నిర్వహించే అర్చకులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంపై తొ లుత పోలీసులు వారినే అనుమానించారు. అయి తే విచారణలో వీరికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అయినా గర్భాలయంలో విధులు నిర్వహించేవారి నిర్లక్ష్యమే చోరీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment