ఉదయపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి భీభత్సం కొనసాగుతోంది. తాజాగా గోగుండాలో ఒక పూజారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పూజారి మృతిచెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ చిరుతపులి ఆలయంలోని పూజారిని నోట కరుచుకుని లాక్కుపోయింది.
కొద్దిసేపటికి ఆలయానికి కొంత దూరంలో పూజారి మృతదేహం స్థానికులకు కనిపించింది. నిత్యం చిరుతపులి దాడులతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు. గడచిన 10 రోజుల్లో చిరుత ఆరుగురిపై దాడి చేసింది. ఇదేవిధంగా గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిరుతపులి దాడిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు బాయి(65) ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. స్థానికులు అడవిలో గట్టు బాయి మృతదేహం కనిపించింది.
మరోవైపు గోగుండ అడవుల్లో ఒక చిరుతపులి అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి దాడుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇటీవల ఐదేళ్ల బాలిక చిరుతపులి దాడిలో మృతి చెందింది. సూరజ్ (5) అనే బాలికను చిరుత నోట కరచుకుని, పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గ్రామస్తులు ఆ బాలిక కోసం వెతకగా, ఆ చిన్నారి మృతదేహం వారికి లభ్యమైంది.
ఇది కూడా చదవండి: AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్‌ఏ మృతి
Comments
Please login to add a commentAdd a comment