Diagnostic Centers
-
మూడు నగరాల్లో సిటీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వ రంగంలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడానికి తొలినుంచి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజారోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాల విస్తరణపైనా ప్రత్యేక దృష్టిపెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామస్థాయిలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ మొదలు బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో ‘సిటీ డయాగ్నోస్టిక్’ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మూడుచోట్లా రూ.20 కోట్ల చొప్పున నిధులతో డయాగ్నోస్టిక్ సెంటర్లతో పాటు, రీజినల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో భవన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఇక విశాఖ, తిరుపతిల్లో డిసెంబర్ నెలాఖరులోగా సివిల్ పనులన్నీ పూర్తిచేసేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. సేవలన్నీ ఒకేచోట.. పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, రేడియాలజీ వంటి వ్యాధి నిర్ధారణ, పరిశోధన సేవలు, పరీక్షలన్నీ ఒకేచోట లభించేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. 100 నుంచి 10 వేల ల్యాబ్ టెస్ట్‌లను నిర్వహించేలా బల్క్టెస్ట్ ఆటోమిషన్ పరికరాలను ఈ కేంద్రాలకు ప్రతిపాదించారు. అలాగే, డిజిటల్ ఎక్స్‌రే ప్లాంట్స్, 360 డిగ్రీల డెంటల్, డిజిటల్ ఎక్స్‌రే యూనిట్స్, 1.5 టెస్లా ఎమ్మారై, కలర్ డాప్లర్, మల్టీచానెల్ ఈసీజీ, పాథాలజీ హెమటాలజీ ఎనలైజర్ సహా పలు రకాల అధునాతన రోగ నిర్ధారణ పరికరాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. అనుభవజు్ఞలైన వైద్యులు, సుశిక్షితులైన పారామెడికల్ సిబ్బందితో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. రిఫరల్ ల్యాబ్స్‌గా అభివృద్ధి.. పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా, బోధనాస్పత్రుల్లో అందుబాటులో లేని నిర్ధారణ పరీక్షలు ఈ సిటీ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. దీంతో వీటిని రిఫరల్ ల్యాబ్స్‌గా కూడా అభివృద్ధి చేయనున్నారు. అదే విధంగా.. కిందిస్థాయి ఆస్పత్రులకు హబ్ స్పోక్ విధానంలో ఇక్కడి సేవలను అందించేలా డిజిటల్ వసతుల కల్పన ఉండనుంది. -
8 జిల్లాల్లో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లు
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా 134 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన కొండాపూర్ జిల్లా ఆస్పత్రి నుంచి వర్చువల్‌గా 8 జిల్లాల్లో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లు, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్‌లను ప్రారంభించారు. అనంతరం కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్, రేడియాలజీ ల్యాబ్, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 31 జిల్లాలలోని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలలో రోగులకు ఉచితంగా 134 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా పీహెచ్సీలలో నమూనాలు ఇస్తే టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లలో పరీక్షలు చేసి 24 గంటల్లో పేషెంట్, డాక్టర్ల ఫోన్లకు రిపోర్ట్లు పంపుతారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే రోగులకు ఉచిత పరీక్షలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రేడియాలజీ ల్యాబ్‌లలో మహిళల్లో కేన్సర్‌ను గుర్తించేందుకు మెమోగ్రామ్, హై అండ్ అల్ట్రాసౌండ్, టీఫా స్కాన్, ఎక్స్‌రే మిషన్, 2డికో ఏకో మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. నారాయణ పేట, మేడ్చల్ జిల్లాలలో త్వరలోనే ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలన్నారు. కొత్తగా 1,400 మంది ఆశావర్కర్లు నిమ్స్‌లో త్వరలో రోబోటిక్ వైద్య పరికరాలు తీసుకొచ్చి.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మంచి వైద్య సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కొత్తగా మరో 1,400 మంది ఆశావర్కర్లు రానున్నారని మంత్రి తెలిపారు. కాగా, తెలంగాణ డాక్టర్లు కరోనా సమయంలో చాలా అద్భుతంగా పని చేశారని, ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, బండ ప్రకాశ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ శ్వేత మొహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ వరదాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఆంక్షలు ఉన్నా.. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రమిత (పేరు మార్చాం) ప్రస్తుతం రెండో నెల గర్భిణి. ఇటీవల హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె బలహీనతకు కారణాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఆమె.. మగపిల్లాడి కోసం ఆరు నెలల గర్భం సహా ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఈసారీ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమైంది. లింగ నిర్ధారణపై నిషేధం, కఠిన ఆంక్షలు ఉన్నా.. ఇన్నిసార్లు నిర్ధారణ, అబార్షన్లు ఎలా సాధ్యమయ్యాయి? ఓవైపు డయాగ్నొస్టిక్స్ కేంద్రాల అక్రమాలు, మరోవైపు విదేశాలకు వెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడుతున్న తీరు పెరుగుతుండటం ఆందోళన రేపుతున్నాయి. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తూ.. మన దేశంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. ఒకవేళ అక్రమంగా పరీక్షలు చేస్తున్నా.. సాధారణ డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడానికి కనీసం గర్భం దాల్చిన 16 వారాల వరకు ఆగాల్సి వస్తోంది. అదే యూకే, అమెరికా, సింగపూర్ వంటి చాలా దేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధమేదీ లేదు. పైగా 8 నుంచి 10 వారాల వ్యవధిలోనే నిర్ధారణ చేస్తుండటం, దీనిని రాతపూర్వకంగా కూడా వెల్లడిస్తుంటారు. మగ పిల్లలు కావాలనుకునే జంటలు దీనిని సావకాశంగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 9–10 వారాల గర్భిణులు విదేశాలకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు. ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటూ.. మన దేశంలో గర్భిణులకు 12 వారాల వరకు అబార్షన్ చేయడానికి చట్టబద్ధంగా వెసులుబాటు ఉంది. విదేశాల్లో లింగ నిర్ధారణ చేయించుకున్నవారు ఆడపిల్ల అని తేలితే.. ఇక్కడికి తిరిగి వచ్చాక ఆస్పత్రులకు వెళ్లి అబార్షన్ చేయించుకుంటున్నారు. ‘కండోమ్ ఫెయిల్యూర్, గర్భం రాకుండా వేసుకునే మందులు తీసుకోవడం మర్చిపోవడం’ అంటూ ఏదో కారణం చెప్తున్నారు. కొందరైతే లింగ నిర్ధారణతోపాటు అబార్షన్ కూడా విదేశాల్లోనే చేయించుకుని వస్తున్నారు. ఇందు కోసం థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తున్నారు. ‘‘డబ్బున్నవాళ్లు లిఖితపూర్వకంగా లింగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఇచ్చే దేశాలకు వెళ్తున్నారు. కొందరు మధ్యతరగతి వారు కూడా మగ పిల్లలు కావాలన్న ఆశతో ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్‌ను నడిపించే వారి సంఖ్య పెరుగుతోంది’’ అని ప్రసూతి, గైనకాలజీ సొసైటీకి చెందిన డాక్టర్ శాంత కుమారి చెప్పారు. చైతన్యం కలిగించడమే మార్గం.. ‘‘తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు మన దేశంలో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేసుకోవడానికి రూ.25,000 నుంచి రూ. 45,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విదేశాలలోనూ చట్టబద్ధంగా కూడా దాదాపు ఇదే ఖర్చు అవుతుంది. ప్రయాణ ఖర్చులే అదనం. విదేశాల్లో పరిశుభ్రమైన పరిస్థితులలో, సరైన మెడికల్ బ్యాకప్‌తో జరుగుతుంది. దీనితో కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి దేశం దాటుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి అవకాశం లేదు. జంటలలో అవగాహన పెంచడం, చైతన్యం కలిగించడం తప్ప మరోదారి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల వ్యవహారం లింగ నిర్ధారణ, తర్వాత అబార్షన్, నేరుగా అవాంఛనీయ గర్భాన్ని గానీ తొలగించుకోవాలనుకునే వారి కోసం.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు, ఆస్పత్రులకు మధ్య ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ, విషయం బయటికి తెలియకుండా ‘పని’ కానిచ్చేస్తూ.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాల వారికి, ఆస్పత్రులకు వీరే సొమ్ము ముట్టజెప్తుంటారు. ఇలాంటి ఏజెంట్లు, దళారుల వల్ల భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. కొడుకు కావాలనే కోరికతో.. మగ పిల్లలు కావాలనే కోరికతో లింగ నిర్ధారణ పరీక్షలకు వెంపర్లాడే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటారనేది సాధారణ నమ్మకం. ఈ విషయంలో సంపన్నులు, బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. పెరుగుతున్న ఖర్చులతో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే కావాలనుకోవడం, అందులోనూ వంశాన్ని కొనసాగించడానికి కొడుకు ఉండాలన్న ఆలోచన, ఆ దిశగా ఇళ్లలో పెద్దల ఒత్తిళ్లు వంటివి.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడానికి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయించేందుకు తెగబడటానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. ఇది కూడా చదవండి: పుడమి తల్లికి తూట్లు! -
మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు!
సాక్షి, అమరావతి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు.. వీరు ఏటా భూసార పరీక్షలు చేయడమే కాదు.. భూసారాన్ని కాపాడేందుకు సిఫార్సు మేరకు తగిన సూక్ష్మపోషకాలందిస్తారు. విత్తు నుంచి కోత వరకు పంటలకు సోకే తెగుళ్లను గుర్తించి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎంత మోతాదులో మందులు వాడాలో చెబుతారు. దగ్గరుండి మొక్కలకు అందేలా చూస్తారు. నాణ్యమైన పంట దిగుబడులు సాధించడమే లక్ష్యంగా..దేశంలోనే తొలిసారిగా ఏపీలోని ఆర్బీకేల్లో ప్లాంట్ హెల్త్ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి తొలుత మండలానికి ఓ ఆర్బీకేలో వీటి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి దశలో 670 ఆర్బీకేల పరిధిలో అమలు.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్లాంట్ హెల్త్ డయాగ్నస్టిక్ సెంటర్లు (పీహెచ్‌డీసీ)గా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేశారు. భూసారం, నీటి, సూక్ష్మ పోషక లోపాలను గుర్తించేందుకు రైతు క్షేత్రం నుంచి నమూనాలు సేకరించి నిర్దేశిత గడువు లోగా ఫలితాలు అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించాలన్న లక్ష్యంతోనే ప్లాంట్ డాక్టర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తొలుత మండలానికి ఓ ఆర్బీకే పరిధిలో పీహెచ్‌డీసీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 670 ఆర్బీకేల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఆర్బీకేలలోనూ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్లాంట్ డాక్టర్స్‌గా శిక్షణ పీహెచ్‌డీసీ ఏర్పాటుకు అనువైన భవనం, సౌకర్యాలున్న ఆర్బీకేలను ఎంపిక చేస్తారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తయిన ఆర్బీకేల్లోని వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల (వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్‌ఎ)ను ఎంపిక చేస్తారు. వీరికి జిల్లా స్థాయిలోని కేవీకే, ఏఆర్ఎస్, డాట్ సెంటర్లలో ఏప్రిల్–మే నెలల్లో కనీసం మూడు వారాల పాటు విడతల వారీగా పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన ఆర్బీకేల్లో అవసరమైన మినీ కిట్స్‌తో పాటు పంటల ఆధారిత లీఫ్ కలర్ (ఎల్సీసీ), సూక్ష్మ పోషక లోపాల చార్ట్‌లను అందిస్తారు. ప్రత్యేకంగా. ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. అగ్రి ల్యాబ్స్‌లో ఉచితంగా పరీక్షలు స్థానికంగా పరీక్షించ తగ్గ వాటిని ఆర్బీకే స్థాయిలో పరీక్షిస్తారు. భూసారంతో పాటు సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను నిర్ధారించేందుకు వాటి శాంపిల్స్‌ను సమీప వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా ఉచితంగా పరీక్షించి వాటి ఫలితాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజిల ద్వారా రైతులకు పంపిస్తారు. అవే ఫలితాలను సంబంధిత శాస్త్రవేత్తలకు పంపిస్తారు. ఫలితాల ఆధారంగా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాత పూర్వకంగా రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో చెబుతారు. సామూహికంగా, వ్యక్తిగతంగా పాటించాల్సిన జాగ్రత్తలు, ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులపై పీహెచ్‌డీసీల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తారు. సిఫార్సు మేరకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, మందులు తగిన మోతాదులో అందేలా చూస్తారు. 2023–24లో కనీసం 5 లక్షల భూసార పరీక్షలు నిర్వహించి ప్రతీ రైతుకు ఈ పీహెచ్‌డీసీల ద్వారా సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
Covid: కొద్దిపాటి జలుబు, జ్వరానికే పాజిటివ్.. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయాందోళనలతో టెస్టుల కోసం వెళ్లే బాధితులను పరీక్ష కేంద్రాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సకాలంలో వెలువడని ఫలితాలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులైనా ఫలితాలు రాకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు కోవిడ్ పరీక్ష ఫీజులను అమాంతం పెంచి నిలువునా దోచుకుంటున్నాయి. వారం, పది రోజుల క్రితం వరకు రూ.500కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఇప్పుడు ఏకంగా రూ,750 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని కేంద్రాలు రూ.1500 వరకు తీసుకుంటున్నాయి. నగరంలో ప్రస్తుతం ఇదో దందాగా మారింది. కొద్దిపాటి జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నా కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ రావడంంతో జనం తప్పనిసరిగా పరీక్షలకు వెళ్లాల్సివస్తోంది. చదవండి: Corona: తగ్గేదేలే అంటున్న కోవిడ్.. ప్రతి 100 మందిలో 15 మంది.. అక్కడా పడిగాపులే... నగరంలోని సుమారు 200కుపైగా బస్తీ దవాఖానాలు, మరో 120 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అన్ని ఏరియా ఆస్పత్రులతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వంటి అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ పరి«ధిలో రోజుకు 50వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అంచనా. ఒక్కో ఆరోగ్య కేంద్రం వద్ద ప్రతిరోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఫలితాల వెల్లడిలో మాత్రం తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. బాధితుల తాకిడి, డిమాండ్ మేరకు పరీక్షలు నిర్వహించే సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల దృష్ట్యా పరీక్షల నిర్వహణలో, ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనివార్యంగా మారింది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఫలితాల కోసం 48 గంటల పాటు నిరీక్షించాల్సివస్తే మరికొన్ని చోట్ల మూడు రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో బాధితులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సాధారణ జలుబు, జ్వరమో, కోవిడ్ లక్షణాలో తేల్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలో, వద్దో తెలియడం లేదు’ అని సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి ‘తమకు తెలియకుండానే కుటుంబ సభ్యులను కూడా వైరస్‌కు గురి చేసినట్లవుతుంద’ని పద్మారావునగర్‌కు చెందిన మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సిబ్బంది కొరత కారణంగానే కొన్ని చోట్ల ఫలితాల వెల్లడిలో ఆలస్యమవుతోందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. ‘ప్రతి రోజూ వందలాది మంది నుంచి నమూనాలను సేకరించే క్రమంలో సిబ్బంది సైతం కోవిడ్ బా రిన పడుతున్నారు’అని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు ఒకరు తెలిపారు, రెండోసారి తప్పనిసరి కాదు.. కోవిడ్ పరీక్షల కోసం రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ‘సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఒమిక్రాన్ బారిన పడినవారు వారం పాటు ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే చాలు. ఆ తర్వాత ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు లేకపోతే ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. మరోసారి పరీక్షలు అవసరం లేదు’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శివరాజ్ తెలిపారు. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ.. బాధితుల అవసరాన్ని, ఆపదను ప్రైవేట్ లాబ్‌లు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువునా దోచుకుంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ కేంద్రాలు పరీక్ష ఫీజులు పెంచేసి దోచుకుంటున్నాయి. ఈ నెల రెండో వారం వరకు కేవలం రూ.500కే ఆర్టీపీసీఆర్ నిర్వహించిన లాబ్‌లలో ఇప్పుడు రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు పెంచారు. వైరస్ ఏ రకం వేరియంటో కూడా తమ పరీక్షల్లో తేలుతుందని, డెల్టా రకమా? ఒమిక్రానా? చెప్పేస్తామని మరికొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు రూ,1500 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నాయి. ఇంటి వద్దకు వచ్చి నమూనాలు సేకరిస్తే అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో వారం, పది రోజుల్లో ఫీజులు మరింత పెరగవచ్చు’ అని సికింద్రాబాద్‌కు చెందిన ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు ఇలా వేల రూపాయల్లో ఖర్చు చేసినప్పటికీ కొన్ని ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లోనూ 24 గంటల తర్వాతే ఫలితాలు వెలువడడం గమనార్హం. -
7న తెలంగాణలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభం
-
ఖరీదైన వైద్య పరీక్షలు ఇక ఉచితం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. సాధారణ పరీక్షలతో పాటు ప్రజలకు అత్యాధునిక, ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో నెలకొల్పిన వైద్య పరీక్షా కేంద్రాలను (డయాగ్నొస్టిక్ సెంటర్లను) ఈ నెల 7వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆ జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో ఇప్పటికే డయాగ్నొస్టిక్ సెంటర్లు సిద్ధమయ్యాయని అధికారులు నివేదించగా.. సోమవారం వాటిని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వైద్య చరిత్రలో ఇదో గొప్ప సందర్భమని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు.. వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసేవలు ప్రజలకెంతో మేలు చేస్తాయని చెప్పారు. మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటున్నన్న రోగి అవసరమైన పక్షంలో, స్వయంగా ఈ కేంద్రాలకు రాలేని పరిస్థితుల్లో.. వైద్యుని సిఫారసు లేఖతో నమూనాలు పంపించి పరీక్షలు చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామని, ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైద్యారోగ్యశాఖ ఉన్నధికారులతో శనివారం మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీపీ, షుగర్ మొదలు.. ‘ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా, రక్త, మూత్ర, బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, ఎముకల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ సంబంధిత జబ్బుల నిర్ధారణకు ఎక్స్–రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదైన పరీక్షలను కూడా పూర్తి ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారు. పరీక్షల రిపోర్టులను రోగుల సెల్ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది. అధునాతన, ఖరీదైన యంత్రాలు అత్యంత అధునిక సాంకేతికతతో కూడిన ఖరీదైన యంత్రాలను పరీక్షా కేంద్రాల కోసం ప్రభుత్వం సమకూర్చింది. ఇలాంటి యంత్రాలు పెద్దపెద్ద కార్పొరేట్ దవాఖానాల్లో.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానాలల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలతో పాటు ఈసీజీ, టూడీ ఎకో, ఆల్ట్రా సౌండ్, డిజిటల్ ఎక్స్– రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలు.. అత్యంత కచ్చితత్వంతో వేగంగా రిపోర్టులందిస్తాయి. గంటకు 400 నుంచి 800 రిపోర్టులు అందజేస్తాయని వైద్యాధికారులు తెలిపారు. రూ.కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాలతో తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు రోగ నిర్ధారణలు చేసి, వైద్య సేవలందించగలుగుతాం. అందుబాటులో లేనిచోట్ల సీటీ స్కానింగ్ యంత్రాలను కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తాం. ఈ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మేరకు పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులు, సహా పరీక్షలను నిర్వహించేందుకు అర్హులైన ఇతర సాంకేతిక సిబ్బందిని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది..’అని సీఎం తెలిపారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారింది.. ‘ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకుందానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. వైద్యం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువైంది. ఈ నడుమ ప్రతి మనిషికి బీపీలు, షుగర్లు ఎక్కువయినయి. వాటి పరీక్ష చేయించుకోవాలి. గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సరు, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు సామాన్యులకూ, పేదలకు అవసరంగా మారినయి. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింది. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు. కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రైవేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం..’అని ముఖ్యమంత్రి వివరించారు. డయాగ్నొస్టిక్ కేంద్రాలు ప్రారంభంకానున్న జిల్లాలు ఇవే.. మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్ నిర్వహించే పరీక్షలివే.. కరోనా, రక్త, మూత్ర, బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, ఎముకల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ సంబంధిత జబ్బుల నిర్ధారణకు ఎక్స్–రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ.. ప్రజలకెంతో మేలు ►కరోనా వంటి ఆపత్కాలంలో ప్రభుత్వం వినియోగంలోకి తెస్తున్న డయాగ్నొస్టిక్ సేవలతో ప్రజలకెంతో మేలు జరుగుతుంది. గంటకు 800 రిపోర్టులు ►అత్యాధునిక యంత్రాలతో కచ్చితమైన, వేగవంతమైన ఫలితాలు వస్తాయి.. గంటకు 400 నుంచి 800 వైద్య పరీక్షల రిపోర్టులు అందజేస్తాయి. రోగులకే ఎస్ఎంఎస్లు ►అందుబాటులో పాథాలజిస్టులు, మైక్రో బయాలజిస్టులు, రేడియాలజిస్టులు ఉంటారు. రోగులకు నేరుగా ఎస్ఎంఎస్ల ద్వారా వైద్య పరీక్షల నివేదికలు పంపిస్తారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు ►పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యం కంటే నిర్ధారణ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువయింది. – కేసీఆర్ చదవండి: Etela Rajender: అది ప్రగతి భవన్ కాదు.. బానిసల భవన్ ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్ -
అరుదైన వ్యాధులకు సీడీఎఫ్‌డీలో చికిత్స
సాక్షి, హైదరాబాద్: అరుదైన వ్యాధులపై పరిశోధనలతోపాటు రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(సీడీఎఫ్‌డీ)ను కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)గా ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 8 వైద్య సంస్థలను సీఓఈలుగా ఎంపిక చేయగా అందులో సీడీఎఫ్‌డీకి స్థానం లభించింది. అరుదైన వ్యాధులపై విధాన ముసాయిదాను తాజాగా సిద్ధంచేసిన కేంద్రం ఆయా వ్యాధుల నియంత్రణ, చికిత్సలకు సంబంధించి ముసాయిదాలో పలు అంశాలను ప్రస్తావించింది. దాని ప్రకారం సీడీఎఫ్‌డీలో అరుదైన వ్యాధులపై పరిశోధనలు నిర్వహిస్తారు. దాంతోపాటు అక్కడే వైద్య పరీక్షలు చేపట్టి చికిత్సలు అందిస్తారు. వైద్యం అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలనూ ఆ కేంద్రంలో ఏర్పాటు చేస్తారు. వైద్యం తీసుకునే వ్యక్తుల సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచి, ఖర్చు ఎక్కువైతే దాతల నుంచి నిధిని సేకరిస్తారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తుంది. అరుదైన వ్యాధుల చికి త్సకు రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం ద్వారా రూ. 15 లక్షల వరకు పేద రోగులకు సాయమందించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముసాయిదాలో పేర్కొంది. 70 శాతం పిల్లలకు సంబంధించినవే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన వ్యాధిగ్రస్తుల్లో 25 శాతం మంది మన దేశంలోనే ఉన్నారని తేలింది. హైదరాబాద్ జనాభాలో దాదాపు ఆరున్నర లక్షల మంది వరకు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సమగ్ర డేటా సేకరించలేకపోయినా ఇకపై భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)లో అరుదైన వ్యాధుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు ముసాయిదాలో తెలిపింది. అరుదైన వ్యాధుల్లో 70 శాతం పిల్లలకు సంబంధించినవి, 12 శాతం పెద్దలకు సంబంధించినవి, 18 శాతం పెద్దలకు, పిల్లలకు సంబంధించినవి ఉంటున్నాయి. అరుదైన వ్యాధుల్లో 72 శాతం జన్యుపరమైనవే. 450 రకాల వ్యాధులు అరుదైనవిగా గుర్తింపు దేశంలో 450 రకాల అరుదైన వ్యాధులున్నట్లు గుర్తించగా ఇంకా గుర్తించాల్సినవి చాలా ఉన్నట్లు తెలిపింది. అయితే వాటిని గుర్తించే డయాగ్నస్టిక్ సెంటర్లు లేకపోవడంతో సమస్య మరింత పెరుగుతోంది. ఖర్చు అధికం కారణంగా ఈ వ్యాధు లను నియంత్రించే మందుల తయారీకి ఔషధ కంపెనీలు ముందుకు రావడంలేదు. అధిక వ్యయం కారణంగా, ప్రభుత్వం ఈ మందులను ఉచితంగా అందించలేకపోతోందని పేర్కొంది. కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు ఏడాదికి రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు అవుతోందని, స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్ల రోగ నిర్ధారణ సవాలుగా మారిందని వివరించింది. సంప్రదాయ జన్యు పరీక్షలో కొన్ని వ్యాధులనే నిర్ధారించే వీలుందని, అధిక ఖర్చుతో కూడిన అరుదైన వ్యాధుల చికిత్సకు ఆర్థికసాయం చేయడం ప్రభుత్వాలకు కష్ట మని తేల్చింది. అందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు అందుకు వేదికగా ఉంటాయని తెలిపింది. వ్యాధుల్లో కొన్ని ఇవీ.. ►ప్రతి 10 లక్షల మందిలో ఇద్దరికే వచ్చే అవకాశ మున్న అక్వైర్డ్ అప్లాస్టిక్ ఎనీమియా (ఎముక మజ్జలో రక్తకణాల ఉత్పత్తి నిలిచిపోవడం) ►ప్రతి వెయ్యి మందిలో ఒకరికి వచ్చే సికిల్ సెల్ డిసీజ్ (ఎర్ర రక్త కణాల్లో డిజార్డర్). ►ప్రతి రెండు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే కంజెనిటల్ ఇన్సెన్సివిటి టు పెయిన్ విత్ యాన్‌హైడ్రోసిస్ (ఏమాత్రం నొప్పి తెలియకపోవడం, చెమట పట్టకపోవడం వంటివి) ►కొన్ని ఎంజైమ్‌లు లేకపోవడంతో వచ్చే లైసోసో మాల్ స్టోరేజీ డిజార్డర్ (మెటబాలిజం డిసార్డర్). ఇది ప్రతి 7,700 మందిలో ఒకరికి వస్తుంది. ►కంటి సంబంధ వ్యాధి మ్యాక్యులర్ డీజనరేషన్. ఇది పెద్దల్లో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 62 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ►నవజాత శిశువులు లేదా పిల్లల గుండె కండరం పనితీరు దెబ్బతినడం లేదా పాడవడం వల్ల వచ్చే పీడియాట్రిక్ కార్డియోమయోపతి. ఇది లక్షలో ఒకరికి వస్తుంది. ►ప్రతి 3,500 మందిలో ఒకరికి వచ్చే కండరాల సంబంధ వ్యాధి మజిల్ డైస్ట్రోఫి. ►తలసీమియా, హీమోఫీలియా వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి. -
చట్టాల ముసుగులో భ్రూణహత్యలు
‘కేవలం 500 ఈరోజు వెచ్చించండి, లక్షలు కట్నంగా ఇవ్వక్కరలేకుండా చూసుకోండి’ అని ఎక్కడ పడితే అక్కడ గోడలపై, బస్సుల మీద పోస్టర్లు వెలి శాయి. పంజాబ్‌లో అమృత్సర్ స్వర్ణాలయం సాక్షిగా ఓ డాక్టర్ దంపతులు క్లినిక్ ఆరంభించి గర్భవతుల కడుపులో ఉన్న పిండం మగా లేక ఆడా అనే నిర్ధారణ చేసే పరీక్షలు నిర్వహిం చడం మొదలెట్టారు. అనాదిగా సమాజంలో ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనే ధోరణి ఉండేది. ఉత్తర భారత దేశంలో పల్లెలు, పట్టణాలు, అక్షరా స్యులు, నిరక్షరాస్యులు అన్న తారతమ్యాలు లేకుండా ఆడపిల్లంటే చిన్న చూపు, ఏవగింపు. అలాంటి తరు ణంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయంటే ఎగిరి గంతేయరూ? పురుషులు భార్య లను ఈ తరహా క్లినిక్‌లలో లింగ నిర్ధారణ చేయించి మగ అయితే ఉంచడం ఆడ అయితే తుంచేయడం మొదలెట్టారు. అప్పట్లో ఐరోపా దేశాల్లో ప్రాచుర్యం పొందిన అమ్నియోసెంటెసిస్ అనే లింగ నిర్ధారణ పరీక్ష అమృత్సర్ నుంచి ఉత్తర భారతదేశంలో మిగి లిన రాష్ట్రాలకి పాకి ఎన్నో క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా లేచాయి. ఇంజెక్షన్ సాయంతో పిండం నుంచి అమ్నియో టిక్ ద్రవం తీసి దాన్లో క్రోమోజోముల నమూనాను విశ్లేషించడమే ఈ అమ్నియోసెంటెసిస్ పరీక్ష. మాన వుల్లో 46 క్రోమోజోములుండగా చివరి రెండు క్రోమోజోములు ఎక్స్, వై లు. ఈ పరీక్ష ద్వారా చివరి రెండు క్రోమోజోములు ఎక్స్ ఎక్స్, లేదా ఎక్స్ వై ఉందా అని తెలుసుకొని ఎక్స్ వై అయితే వెలిగి పోతున్న మొహంతో ‘అభినందనలు అబ్బాయే పుడ తాడు’, ఒక వేళ ఎక్స్ ఎక్స్ ఉంటే ‘లాభం లేదు, అబార్షన్ చేసి తీసేయాలి’ అని 3 అబార్షన్లు, 6 టెస్టులతో దినదినాభివృద్ధి చెందిందీ వ్యాపారం. అమ్నియోసెంటెసిస్ వ్యవహారంపై ఆందోళన చెందిన స్త్రీవాద సంస్థలు గళమెత్తి ఈ పరీక్షలపై నిషేధం విధించాలని దేశ వ్యాప్తంగా పట్టుబట్టారు. గర్భంలో ఉన్న పిండం ఆరోగ్యం తెలుసుకునే నిమిత్తం 1974లో న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో మొట్ట మొదట అమినోసెన్సేసిస్ పరీక్షలు చేసే విభాగాన్ని నెలకొల్పారు. స్త్రీవాద సంస్థల పోరాటం నడుమ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసర్చ్ అనే సంస్థ ఈ లింగ నిర్ధారణ పరీక్షలు నిలిపివేయవల్సిందిగా ఎయిమ్స్ని కోరడంతో 1975 నుంచి ఎయిమ్స్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మానేశారు. అప్పుడు మనుగడలో ఉన్న ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ యాక్ట్‌లో లొసుగుల వల్ల భ్రూణ హత్యకు అడ్డూ అదుపు లేక పోయింది. అలా ఈ భ్రూణ హత్యలు, శిశుహత్యల కారణంగానే భారతదేశంలో లింగ నిష్పత్తి క్షీణిం చింది. 1951 లో పిల్లల లింగ నిష్పత్తి 983 ఉండగా, 1981 నాటికి 962 పడిపోయింది. 1994–2017 మధ్య ప్రీ–కన్సెప్షన్ అండ్ ప్రి– నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ కింద లింగ నిర్ధారణ జరిగిన నేరంపై కేవలం 2350 కేసులు దాఖలయ్యాయి అంటే మన చట్టాలు ఎంత పదునై నవో, కఠినమైనవో వ్యక్తమవుతోంది. ఈ కేసుల్లో కూడా సింహ వాటా మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగినవే. భ్రూణ హత్యలు భార తదేశాన్నే కాక ఎన్నో పేద, సంపన్న అన్న తేడా లేకుండా అగ్ర దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలనన్నిటినీ పట్టి పీడిస్తున్న రోగం. పాపులేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, భారతదేశంలో సగటున రోజువారీ 2,330 లింగ నిర్ధారిత గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఏళ్లలో దాదాపు 11.8 కోట్ల ఆడపిల్లలు గర్భంలో ఉండగా లేదా పుట్టేక మొదటి వారంలోనే భ్రూణ హత్యకు గురయ్యారు. 1991 మరియు 2011 మధ్య సగటున ప్రతి ఏటా 13 లక్షల మంది ఆడ శిశువులను నవజాత శిశు హత్య ద్వారా మట్టుబెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రక టించి 2012 నుంచి జరుపుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొనే సవాళ్లను వెలుగులోకి తెచ్చి పరిష్కరించడం, మహి ళల మానవ హక్కుల అవసరాలు వాటి నెరవేర్పు లపై దృష్టి కేంద్రీకరించేలా చేయడం. లింగ నిష్పత్తి అసమానంగా పెరుగుతున్న కొలది మహిళలపై నేరాలు, ఘోరాలు పెరుగుతూనే ఉంటాయి. భారత పౌరులు అనుమతి లేకుండా ఏ దేశంలోనూ గర్భస్రావం చేసుకోకుండా ఉండేటట్లు, గర్భం దాల్చిన వెంటనే గర్భవతుల రికార్డుల నమోదు, పర్యవేక్షణ వంటి కొత్త నిబంధనల చట్టం తీసుకురావడం అవసరం. పరిస్థితులు ఇలానే కొన సాగితే 2050 నాటికి బహుభార్యత్వం లాగ ఒకే భార్యని బహు భర్తలు పంచుకోవాల్సిన గడ్డు రోజులు దాపురిస్తాయనడం అతిశయోక్తి కాదేమో! సునీల్ ధవళ వ్యాసకర్త సీఈఓ, ద థర్డ్ అంపైర్ మీడియా మొబైల్ : 97417 47700 -
క్లినిక్‌లలో 100 కోట్ల నల్లధనం
బెంగళూరు: ఐవీఎఫ్ క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలతో కొందరు వైద్యులు సాగిస్తున్న రహస్య సంబంధాలు బెంగళూరులో బట్టబయలయ్యాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ కామిని రావ్‌కు చెందిన క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లలో సుమారు రూ.100 కోట్ల నల్లధనమున్నట్లు ఆదాయపన్ను అధికారులు గుర్తించారు. తమ దాడుల్లో రూ.1.4 కోట్ల నగదు, 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఐటీ శాఖ ప్రకటించింది. అలాగే విదేశీ కరెన్సీ, కోట్లాది రూపాయల నిల్వలున్న విదేశీ ఖాతాలను కూడా కనుగొన్నట్లు తెలిపింది. ఆయా కేంద్రాలకు రోగులను రెఫర్ చేస్తున్నందుకు బదులుగా అవి డాక్టర్లకు భారీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. తమ సోదాల్లో ఆ ల్యాబ్‌లలో రూ.100 కోట్ల అప్రకటిత ఆదాయం ఉన్నట్లు కనుగొనగా, ఒక్కో ల్యాబ్‌లో డాక్టర్లకు చెల్లించిన రెఫరల్ ఫీజు రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది. తమకు రోగులను పంపిన డాక్టర్లకు ల్యాబ్‌లు చెల్లిస్తున్న అనేక విధానాలను గుర్తించామని పేర్కొంది. ‘డాక్టర్లకు అందుతున్న కమిషన్ ల్యాబ్‌ను బట్టి మారుతుంది. ఎంఆర్ఐ పరీక్షలకు 35 శాతం, సిటీ స్కాన్, ఇతర పరీక్షలకు 20 శాతం చొప్పున ఇస్తున్నారు. అయితే ఈ చెల్లింపులను ల్యాబ్‌లు మార్కెటింగ్ ఖర్చులుగా చూపుతున్నాయి. కొన్నిసార్లు డాక్లర్లకు చెల్లించే రెఫరల్ ఫీజును ప్రొఫెషనల్ ఫీజుగా చూపుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఆసుపత్రులు డాక్టర్లను ఇన్–హౌస్ కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నాయి. కానీ వారు క్లినిక్‌లకు రారు. పేషెంట్లను చూడరు. రిపోర్టులు రాయరు. డాక్టర్లకు కమిషన్లు చేరవేసేందుకు కొన్ని ల్యాబ్‌లు కమిషన్ ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి’ అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
భయాగ్నస్టిక్స్!
♦ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు ♦ అనుమతుల్లేకుండానే పరీక్షల నిర్వహణ ♦ అక్రమంగా కొనసాగుతున్న కేంద్రాలు 519 ♦ రెన్యువల్‌కు దరఖాస్తుల చేసుకోని కేంద్రాలు ♦ వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలనలో వాస్తవాలివి.. జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. నిబంధనలను అసరించి తెరవాల్సిన ఈ కేంద్రాలు.. అనుమతుల్లేకుండానే కొనసాగుతున్నారుు. ఇందులో కార్పొరేట్ ఆస్పత్రులకు అనుబంధంగా నడుస్తున్నవే అధికం. పీసీపీఎన్ డీటీ (లింగనిర్ధారణ) చట్టం ప్రకారం జన్యు ప్రయోగశాలలు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరి. కానీ జిల్లాలో అనుమతి లేకుండా 519 డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నారుు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం 934 డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నారుు. ఈ కేంద్రాలు ఏటా పరీక్షల తాలూకు వివరాలు సమర్పించి గుర్తింపు కోసం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత అనుమతి తీసుకున్నప్పటికీ.. రెన్యూవల్ తప్పనిసరి. కానీ జిల్లాలో సగానికిపైగా రెన్యూవల్ చేరుుస్తున్న దాఖలాల్లేవు. జిల్లాలో 415 డయాగ్నస్టిక్ కేంద్రాలకు మాత్రమే ప్రస్తుతం అనుమతులున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నారుు. మిగతా 519 కేంద్రాలు యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోలేదు. ఈ క్రమంలో ఆయా సెంటర్లలో చేసే పరీక్షలు పరిగణలోకి తీసుకోకూడదు. కానీ పలు ఆస్పత్రులు వీటినే రిఫర్ చేస్తూ పేషంట్లను పంపడం గమనార్హం. పర్యవేక్షణ గాలికి.. అనుమతిలేని డయాగ్నస్టిక్, అల్టా్ర సౌండ్ స్కానింగ్ సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ నిఘా ఏర్పాటు చేయాలి. కానీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఈ ప్రక్రియలో విఫలమవుతోంది. పీసీపీఎన్ డీటీ చట్టం ప్రకారం అనుమతి లేని కేంద్రాల పట్ల యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి పనితీరును పర్యవేక్షించాలి. కానీ జిల్లాలో రెండేళ్లుగా వైద్యశాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భాలు లేవు. దీంతో జిల్లాలో 519 కేంద్రాలు అనుమతి లేనప్పటికీ కార్యకలాపాల్ని దర్జాగా నిర్వహిస్తున్నారుు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
జనరల్ విభాగంలో 2,975 మంది విద్యార్థుల గైర్హాజరు విద్యారణ్యపురి : ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదనే నిబంధన విధించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకున్నారు. కొందరు విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు చేరుకొన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 44,766 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండ గా 41,791 మంది హాజరయ్యూరని, 2,975 మంది పరీక్షకు రాలేదని ఇంటర్ విద్య ఆర్ఐవో షేక్ అహ్మద్ వెల్లడించారు. ఒకేషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరంలో 5,382 మంది విద్యార్థులకు 4,6452 మంది హాజరుకాగా.. 730 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పలు చోట్ల హైస్కూళ్లలో కూడా పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఉదహరణకు మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఎక్కువ మంది విద్యార్థులుండటంతో పక్కనే ఉన్న ప్రభుత్వ హైస్కూల్లోను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో కొంత మంది విద్యార్థులను నేలమీద కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తుండగా అక్కడికి వెళ్లి స్క్వాడ్ బృందం ఆర్ఐవో దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆ కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఫర్నీచర్ సౌకర్యం కల్పించినట్లు ఆర్ఐవో వెల్లడించారు. కాగా, నేడు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నారుు. -
ప్రైవేటుకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ కేంద్రాలన్నింటినీ ఒకే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహిస్తూ... చేసిన పరీక్షలను బట్టి సొమ్ము చెల్లించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ప్రైవేటు’కు మేలు చేసేందుకే డయాగ్నొస్టిక్ కేంద్రాల అప్పగింత, పీపీపీ పద్ధతిలో నిర్వహణను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వం ప్రైవేట్‌కు మేలు చేసేందుకు ఈ విధానాన్ని అమలు చేయడంపై తీవ్రంగా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం... ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయి వరకు అన్ని ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఆరోగ్యశ్రీ కార్డులున్న రోగులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకయ్యే ఖర్చును ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది. దీనిని ప్రభుత్వ వైద్యులు తప్పుపడుతున్నారు. ప్రైవేటుకు ఇవ్వడం కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే... ప్రభుత్వమిచ్చే సొమ్ముతో మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. రక్త పరీక్షలకూ దిక్కులేదు.. రాష్ట్రంలో సుమారు 740 పీహెచ్‌సీలు, 5 వేల వరకు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇక 115 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 42 ఏరియా ఆసుపత్రులు, 10 జిల్లా ఆసుపత్రులు, 18 బోధనాసుపత్రులు, 5 మెటర్నిటీ ఆసుపత్రులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసే సౌకర్యం లేదు. పీహెచ్‌సీల్లో అయితే కనీసం రక్త పరీక్షలు కూడా చేసే దిక్కులేదు. ఏరియా ఆసుపత్రుల్లోనూ అరకొర వసతులే. కనీసం స్కానింగ్, ఎక్స్‌రే వంటి వసతులైనా లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయదలచిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను... ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వైద్యులు కోరుతున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించడానికి పెద్దగా ఖర్చు ఉండదని... ఎక్స్‌రే, స్కానింగ్, ఎంఆర్ఐ యంత్రాలను ఒకసారి ఏర్పాటు చేస్తే పేద రోగులకు శాశ్వతంగా మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్ వంటి వసతులు ప్రభుత్వమే కల్పిస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఒకే ఏజెన్సీకి.. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదన అమల్లోకి వస్తే ఒకే ప్రైవేటు ఏజెన్సీకి డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య లోపాలతో స్మార్ట్ కార్డులను జారీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని, వసతిని ప్రైవేటు ఏజెన్సీకి ప్రభుత్వమే కల్పిస్తుంది. అయితే విద్యుత్ బిల్లుల నుంచి రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించడం దాకా నిర్వహణ బాధ్యత మొత్తం ప్రైవేటు ఏజె న్సీదే. ఏ ఆసుపత్రిలో ఏ రోజు ఎన్ని వైద్య పరీక్షలు నిర్వహించారనే సమాచారాన్ని ఆ ఆస్పత్రి వైద్యులు, ప్రైవేటు ఏజెన్సీ కలసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. దాని ప్రకారం ఏజెన్సీకి ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. అయితే వైద్య పరీక్షలు చేయకుండానే.. చేసినట్లు నమోదు చేస్తే ఎలాగన్న ప్రశ్న కూడా అధికారుల్లో నెలకొంది. ఇలా అక్రమాలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. -
రోగ నిర్ధారణ కేంద్రాలకు మహర్దశ
ల్యాబ్ ఫర్ లైఫ్ ప్రాజెక్టును చేపడుతున్న కేంద్రం వైద్యాధికారులతో నేడు హైదరాబాద్‌లో సమావేశం సాక్షి, హన్మకొండ: ఇప్పటి వరకు మలేరియా, రక్త పరీక్షలకే పరిమితమైన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగనిర్థారణ పరీక్ష కేంద్రాల స్థాయి పెరగనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ల్యాబొరేటరీల్లో మౌలిక సదుపాయాల మెరుగు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాబ్స్ ఫర్ లైఫ్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ పథకాన్ని అమలు చేయడంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై తెలంగాణ వైద్యాధికారులతో నేడు హైదరాబాద్‌లో సమావేశం జరగనుంది. పెరగనున్న సేవలు పేద ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చుల్లో రోగ నిర్ధారణ కోసం వెచ్చిస్తున్న మొత్తం ఎక్కువగా ఉంది. ఎక్కువశాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగనిర్థారణ కేంద్రాల మలేరియా, రక్త పరీక్షలే సాధ్యమవుతున్నాయి. మూత్రం, కళ్లె, రక్తం, టీబీ, డెంగ్యూ తదితర రోగాల నిర్థారణ కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వైద్యఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ముఖ్యమైన రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా పేదరోగులపై పడే భారాన్ని తగ్గించేందుకు వీలుంది. ఈ మేరకు ల్యాబ్ ఫర్ లైఫ్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, రోగ నిర్ధారణ నిపుణులు (పాథాలజిస్టు)లకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అమెరికాకు చెందిన డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ సహకారాన్ని అందిస్తోంది. దేశంలో ఏడు రాష్ట్రాలు దేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదకొండు జిల్లాల్లో ల్యాబ్స్ ఫర్ లైఫ్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం జిల్లాలు ఎంపికయ్యాయి. -
డాక్టర్స్ లేన్...
సినిమాలకు క్రాస్‌రోడ్స్.. అమ్మాయిల షాపింగ్‌కు కోటి... ఇలా హైదరాబాద్‌లో కొన్ని అడ్డాలున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కేపీహెచ్‌బీలోని రోడ్‌నెంబర్ 4 చేరింది. ఆ గల్లీలో వందలాది క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోంలు, టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్లు... ఇలా మనిషికి అవసరమయ్యే ప్రతి స్పెషాలిటీ క్లినిక్ కనబడుతుంటుంది. 2006కు ముందు ఏ మాత్రం చడిచప్పుడు లేని ఆ కాలనీ... ఇప్పుడు ఎటు చూసినా క్లినిక్‌ల మయమైంది. కొన్ని క్లినిక్‌లు ఆస్పత్రులుగా మారాయి. మెడికల్ షాప్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. 1991లో... మొదటిసారి విఘ్నేశ్ క్లినిక్, ఎస్వీఎస్ క్లినిక్ ఏర్పాటయ్యాయా గల్లీలో. అప్పుడు సాయంత్రం ఆరు దాటిందంటే ఎటు చూసినా చీకటే. కేవలం ఈ రెండు క్లినిక్‌లు కరెంట్ వెలుగులతో కనిపించేవి. ఏ రోగమొచ్చినా, ప్రసవాలైనా, రోడ్డు ప్రమాదంలో గాయాలైనా ఈ క్లినిక్‌లకు క్యూ కట్టేవారు. బొల్లారం, బాచుపల్లి, చందానగర్, మూసాపేట, లింగంపల్లి, పటాన్ చెరువు, ఆశోక్ నగర్, జీడిమెట్ల, సూరారం కాలనీవాసులకు ఈ క్లినిక్‌లే దిక్కు. ఆ రెండు తరువాతి రోజుల్లో విఘ్నేశ్ నర్సింగ్ హోమ్‌గా, ఎస్వీఎస్ చిల్డ్రన్ హాస్పిటల్‌గా మారిపోయాయి. కార్పొరేట్ హంగులతో రెడిమేడ్ ఆస్పత్రి రావడంతో కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 4 దశ తిరిగింది. ఈ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లే పార్ట్‌టైమ్‌గా ఈవెనింగ్ క్లినిక్‌లు ప్రారంభించారు. రోగులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆ లైన్ కాలక్రమేణా డాక్టర్ లేన్‌గా మారింది. ఇప్పుడు కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ నాలుగు అనేకంటే డాక్టర్స్ గల్లీ అంటేనే సులభంగా గుర్తు పడతారు. ఎందుకీ డిమాండ్... ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లినా కన్సల్టెంట్ ఫీజు... రూ. 500లకు తక్కువ లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కన్నా కన్సల్టెంట్ ఫీజు తక్కువ ఉండటం, రీజనబుల్ ధరలకే రూమ్‌లు దొరకడంతో వీటికి రోగుల తాకిడి పెరిగింది. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా వెలవడంతో అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీప ప్రాంతాలైన కూకట్పల్లి, మియాపూర్‌లో నివాసాలు ఏర్పరుచుకోవడం, ఇతర జిల్లాలనుంచి వచ్చిన మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేట్ ఖర్చులు పెట్టలేక అందుబాటులో ఉన్న ఈ క్లినిక్లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రేటులోనే ట్రీట్మెంట్ పూర్తవడం, డాక్టర్ల గురించి ఎక్కువ సేపు వేచివుండాల్సిన అవసరం లేకపోవడం... వంటికారణాలన్నీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. టెస్టుల కోసం... ఎంతో దూరంనుంచి హాస్పిటల్‌కు వెళ్తే.. డాక్టర్ టెస్టులు రాస్తాడు. వాటికోసం మళ్లీ ఇంకెక్కడికో పరుగెత్తాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా... అన్ని పరీక్షలకు అవసరమైన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఈ లేన్‌లో ఉన్నాయి. కార్డియాల జిస్ట్, డెర్మటాల జిస్ట్, గ్యాస్ట్రాంటల జిస్ట్, గైనకాల జిస్ట్, హెమటాల జిస్ట్, నెఫ్రాల జిస్ట్, న్యూరోసర్జన్, అర్థోపెడిస్ట్, సర్జన్, యూరాల జిస్ట్, డెంటిస్ట్, ఐ స్పెషలిస్ట్... ఇలా ఒకటి కాదు... స్పెషలిస్ట్ క్లినిక్‌లు.. ప్రతి ఒక్కటీ కొలువుదీరాయిక్కడ. - వీఎస్ -
అక్కర లేకున్నా వైద్యపరీక్షలు
డయాగ్నస్టిక్ సెంటర్లలో నిలువుదోపిడీ ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు నిశ్చేష్టులై చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నల్లగొండ టౌన్ : జిల్లాలో సుస్తి చేసిందని వ్యక్తి అస్పత్రికి వచ్చాడంటే ల్యాబ్ నిర్వాహకులకు పండగే పండుగ.. అవసరం లేకున్నా సదరు డాక్టర్ రక్త, మూత్ర, ధైరాయిడ్, ఈసీజీ, షుగర్, స్కానింగ్ ఇతర పరీక్షలకు రెఫర్ చేయడం.. తప్పని సరి పరిస్థితులలో డాక్టర్ సూచించిన విధంగా పరీక్షలను నిర్వహించుకుని జేబులు ఖాళీ చేసుకోవడం రోగులకు పరిపాటిగా మారింది. వచ్చిన జబ్బుకు డాక్టర్ రాసే మందుల ఖర్చుకు మూడింతలు, నాలుగింతలు వైద్య పరీక్షలకు వెచ్చించాల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే వారి నుంచి పరీక్షల పేరుతో నిలువుదోపిడి చేస్తూ ల్యాబ్‌ల నిర్వాహకులు లక్షలాది రూపాయలను ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే... జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, హుజూర్నగర్, కోదాడ , చౌటుప్పల్, నకిరేకల్‌తో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున డయాగ్నస్టిక్ సెంటర్లు వెలిశాయి. నర్సింగ్హోమ్లతో పాటు ఇతర క్లినిక్‌లకు అనుబంధంగా ఇబ్బడి ముబ్బడిగా వందలాది ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అమాయక ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారు. జిల్లాలో అధికారికంగా నర్సింగ్‌హోమ్‌లలో 215 డయాగ్నస్టిక్ సెంటర్లు ఉండగా, ఇతర ల్యాబ్‌లు 70 కలిపి మొత్తం 285కి మాత్రమే అనుమతులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద రికార్డులు ఉన్నాయి. అయితే వీటికి అదనంగా అనుమతులు లేకుండా మరో 50 వరకు చిన్నాచితక ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రి లేదా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకోవాలి. ఆస్పత్రి లేదా ల్యాబ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తొలుత తాత్కాలిక ధ్రవీకరణ పత్రం జారీ చేస్తారు. అనంతరం పదిరోజుల్లో ఆస్పత్రిని పరిశీలించి అర్హులైన వైద్యులు, మౌలిక వసతులు, అత్యవసర వైద్య పరికరాలు, వ్యర్థపదార్థాల నిర్మూలన వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటివన్నీ సక్రమంగా ఉంటే శాశ్వత నమోదు పత్రం జారీ చేస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన ల్యాబ్‌లు ఉన్నట్లు కనబడడం లేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనబడని ఫీజుల పట్టికలు... ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరైజేషన్ యాక్టు ప్రకారం ప్రతీ ప్రైవేటు ల్యాబ్ లోనూ వారు అందించే సేవలు, వాటికి వసూళ్లు చేస్తున్న ఫీజులను తెలిపే బోర్డులను తెలుగు, ఇంగ్లీష్లలో ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడ కూడా ల్యాబ్‌లలో ఈ విధమైన బోర్డులు కనిపించవు. కొరవడిన నిఘా జిల్లాలోని ప్రయివేటు ల్యాబ్‌లపై ఆయా ప్రాంతాలలోని సీనియర్ పబ్లిక్‌హెల్త్ ఆఫీసర్ల నిఘా కొరవడింది. ఎస్పీహెచ్ఓలు ప్రతి నెల వారి పరిధిలోని ల్యాబ్‌లను తనిఖీ చేయడంతో పాటు లింగనిర్ధారణ పరీక్షల వివరాలు, ఇతర పరీక్షల వివరాలు, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి పరీక్షల వివరాలను సేకరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నివేదించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలను నిర్వహిస్తే ల్యాబ్ అనుమతిని రద్దు చేయాలి. కానీ కాసులకు కక్కుర్తి పడిన సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీనిని అసరాగా తీసుకున్న ల్యాబ్‌ల నిర్వాహకులు ఆడిందే ఆట.పాడిందే పాటగా వ్యవహరిస్తూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యహరిస్తే చర్యలు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రయివేటు ల్యాబ్‌లపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వాటిని సీజ్ చేస్తాం. ల్యాబ్‌లలో అనుమతి పత్రంతో పాటు ఫీజుల వివరాలను తెలిపే బోర్డులను ఏర్పాటుచేయాలి. జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులలో అన్ని ప్రైవేట్ ల్యాబ్‌లను పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను పంపిస్తాం. - డాక్టర్ పి.ఆమోస్, డీఎంహెచ్ఓ