సోహైబ్‌ మక్సుద్‌ ఔట్‌.. పాక్‌ జట్టులోకి సీనియర్‌ క్రికెటర్‌ | Sohaib Maqsood Ruled Out Of Pakistan T20WC Squad Due To Back Injury | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: సోహైబ్‌ మక్సుద్‌ ఔట్‌.. పాక్‌ జట్టులోకి సీనియర్‌ క్రికెటర్‌

Published Sat, Oct 9 2021 4:46 PM | Last Updated on Sat, Oct 9 2021 5:15 PM

Sohaib Maqsood Ruled Out Of Pakistan T20WC Squad Due To Back Injury - Sakshi

Shoaib Malik Replaced By Sohaib Maqsood... టి20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందే పాకిస్తాన్‌ జట్టుకు షాక్‌ తగిలింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బ్యాటర్‌ సోహైబ్‌ మక్సూద్‌ జట్టు నుంచి వైదొలిగాడు. కాగా మక్సూద్‌ స్థానంలో షోయబ్‌ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.నేషనల్‌ టి20 కప్‌లో ఆడుతున్న మక్సూద్‌ అక్టోబర్‌ 6న మ్యాచ్‌ ఆడుతుండగా వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం వైద్యులు అతన్ని పరీక్షలకు పంపారు. తాజాగా వచ్చిన ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ రిపోర్ట్‌లో మక్సూద్‌ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలిందని.. కొన్నివారాల పాటు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. 

ఇక మక్సూద్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన షోయబ్‌ మాలిక్‌ 2007 టి20 ఆరంభ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్‌ చేర్చాడు. అనంతరం 2009 టి20 ప్రపంచకప్‌ విజేత పాకిస్తన్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న షోయబ్ ఆ తర్వాత 2012, 2014, 2016లో టి20 ప్రపంచకప్‌లు ఆడాడు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన షోయబ్‌ మాలిక్‌ పాక్‌ తరపున 35 టెస్టులు, 287 వన్డేలు, 116 టి20లు ఆడాడు.

చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్‌ అయ్యానని విరాట్‌ భాయ్‌ చెప్పాడు!

దీంతో పీసీబీ అతన్ని టి20 ప్రపంచకప్‌ జట్టు ప్రాబబుల్స్‌ నుంచి తప్పించినట్లు పేర్కొంది. కాగా సోహైబ్‌ మక్సూద్‌ పాకిస్తాన్‌ తరపున 29 వన్డేల్లో 781 పరుగులు.. 26 టి20ల్లో 273 పరుగులు సాధించాడు. కాగా టి20 ప్రపంచకప్‌కు సంబంధించి శుక్రవారం పీసీబీ సెలెక్టర్లు పాకిస్తాన్‌ జట్టులో మూడు మార్పులు చేశారు. మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు హైదర్‌ అలీ, ఫఖర్‌ జమాన్‌లు 15 మంది ప్రాబబుల్స​లో చోటు దక్కించుకున్నారు. కాగా అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్‌ 24న ఆడనుంది.

చదవండి: T20 World Cup 2021: పాకిస్తాన్‌ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు

టి20 ప్రపంచకప్‌: పాకిస్తాన్‌ 15మందితో కూడిన జట్టు
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌

రిజర్వ్‌ ఆటగాళ్లు- కుష్‌దిల్‌ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement