
Shoaib Malik Fastest Fifty In T20 WC 2021: టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో దుమ్మురేపాడు. సిక్సర్ల వర్షం కురిపించిన మాలిక్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్‌తో ( 18 బంతుల్లో 50, స్కాట్లాండ్‌పై ) కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు.
చదవండి: Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ కొత్త చరిత్ర.. గేల్ రికార్డు బద్దలు
ఇక ఓవరాల్‌గా చూస్తే టి20 ప్రపంచకప్‌ల్లో మాలిక్‌ది ఐదో వేగవంతమైన అర్థ శతకం. యువరాజ్ సింగ్(12 బంతులు, 2007, ఇంగ్లండ్‌పై), స్టీఫన్ మైబర్గ్(17 బంతులు, 2014, ఐర్లాండ్‌పై), గ్లెన్ మ్యాక్స్‌వెల్(18 బంతులు, 2014, పాకిస్తాన్‌పై), కేఎల్ రాహుల్(18 బంతులు, 2021, స్కాట్లాండ్‌పై), షోయబ్ మాలిక్(18 బంతులు, 2021, స్కాట్లాండ్‌పై) వరుసగా ఉన్నారు . ఇక పాకిస్తాన్ తరపున టి20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న ఆటగాడిగా మాలిక్ తొలి స్థానంలో నిలిచాడు. ఇంతకముందు ఉమర్ అక్మల్( 2010లో ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో, 2016లో న్యూజిలాండ్‌పై 22 బంతుల్లో) రెండోస్థానంలో ఉన్నాడు.