fastest T20 half-century
-
పాక్ తరపున తొలి బ్యాటర్‌గా.. టి20 ప్రపంచకప్ చరిత్రలో
Shoaib Malik Fastest Fifty In T20 WC 2021: టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ స్కాట్లాండ్తో మ్యాచ్‌లో దుమ్మురేపాడు. సిక్సర్ల వర్షం కురిపించిన మాలిక్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్‌తో ( 18 బంతుల్లో 50, స్కాట్లాండ్పై ) కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. చదవండి: Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ కొత్త చరిత్ర.. గేల్ రికార్డు బద్దలు ఇక ఓవరాల్‌గా చూస్తే టి20 ప్రపంచకప్‌ల్లో మాలిక్‌ది ఐదో వేగవంతమైన అర్థ శతకం. యువరాజ్ సింగ్(12 బంతులు, 2007, ఇంగ్లండ్‌పై), స్టీఫన్ మైబర్గ్(17 బంతులు, 2014, ఐర్లాండ్‌పై), గ్లెన్ మ్యాక్స్‌వెల్(18 బంతులు, 2014, పాకిస్తాన్‌పై), కేఎల్ రాహుల్(18 బంతులు, 2021, స్కాట్లాండ్పై), షోయబ్ మాలిక్(18 బంతులు, 2021, స్కాట్లాండ్పై) వరుసగా ఉన్నారు . ఇక పాకిస్తాన్ తరపున టి20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న ఆటగాడిగా మాలిక్ తొలి స్థానంలో నిలిచాడు. ఇంతకముందు ఉమర్ అక్మల్( 2010లో ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో, 2016లో న్యూజిలాండ్‌పై 22 బంతుల్లో) రెండోస్థానంలో ఉన్నాడు. -
Jos Buttler: టి20 ప్రపంచకప్ 2021లో అత్యంత వేగవంతమైన అర్థశతకం
Jos Buttler Records Fastest Fifty In T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు.. 4 సిక్సర్లతో బట్లర్ ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ ప్రపంచకప్‌లో జాస్ బట్లర్ చేసిన అర్థశతకం అత్యంత వేగవంతమైనది కావడం విశేషం. ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన బట్లర్ ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫిఫ్టీ తర్వాత కూడా బట్లర్ తన జోరును ఆపలేదు. ఓవరాల్‌గా 32 బంతులెదుర్కొన్న బట్లర్ 5 ఫోర్లు.. 5 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. చదవండి: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు AUS Vs ENG: బట్లర్ ఊచకోత.. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘనవిజయం; సెమీస్ బెర్తు దాదాపు ఖరారు Buttler brings up his fifty with a big six https://t.co/jXLOAwhunL via @t20wc — Bhavana.Gunda (@GundaBhavana) October 30, 2021 -
జైశ్వాల్ కొత్త చరిత్ర.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు
Yashasvi Jaiswal Record Fastest 50 As Uncapped Player.. సీఎస్కేతో జరుగుతున్న మ్యచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఇషాన్ కిషన్(2018లో కేకేఆర్‌పై) 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. ఇక మూడో స్థానంలో దీపక్ హుడా(20 బంతుల్లో, రాజస్తాన్ రాయల్స్‌పై, 2021); దీపక్ హుడా(22 బంతుల్లో, 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై); కృనాల్ పాండ్యా 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొని ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సంచలన విజయం దిశగా సాగుతుంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రాజస్తాన్ విజయానికి ఇంకా 20 పరుగుల దూరంలో ఉంది. -
ఈసారి 10 బంతుల్లోనే ఆ రికార్డు కొట్టాలి!
న్యూఢిల్లీ: ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు నిన్నటివరకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. దానిని ఇప్పుడు వెస్టిండిస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ సమం చేశారు. 12 బంతుల్లో అర్థ శతకం బాది తన రికార్డును గేల్ సమం చేయడం యువీకి నిరాశ కలిగించిందట. అదే 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి.. తన రికార్డును బద్దలుకొట్టి ఉంటే తాను మరింత ఆనందించేవాడినని యువరాజ్ చెప్పాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో గేల్ యూవీ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యువరాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ '12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టి గేల్ నన్ను నిరాశ పరిచాడు. కాకా(గేల్) నెక్స్ట్ టైం 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదు. లేదంటే ఏబీ డివీలియర్స్ ఆ ఫీట్‌ను సాధించే అవకాశముంది' అని పేర్కొన్నాడు. 20-20లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోతున్న క్రిస్ గేల్ 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో ఇటీవల 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టి యూవీ రికార్డును సమం చేశాడు. 2007లో టీ-20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ మొదట ఈ అరుదైన ఘనతను సాధించాడు. స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి.. భారత క్రికెట్ అభిమానుల మదిలో చెరుగని జ్ఞాపకాలను నమోదుచేసిన ఈ స్టైలిస్ట్ బ్యాట్స్‌మన్ 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.