
Courtesy: IPL Twitter
Yashasvi Jaiswal Record Fastest 50 As Uncapped Player.. సీఎస్‌కేతో జరుగుతున్న మ్యచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఇషాన్ కిషన్(2018లో కేకేఆర్‌పై) 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. ఇక మూడో స్థానంలో దీపక్ హుడా(20 బంతుల్లో, రాజస్తాన్ రాయల్స్‌పై, 2021); దీపక్ హుడా(22 బంతుల్లో, 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై); కృనాల్ పాండ్యా 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొని ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇక సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సంచలన విజయం దిశగా సాగుతుంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రాజస్తాన్ విజయానికి ఇంకా 20 పరుగుల దూరంలో ఉంది.