Courtesy: CSK Twitter
Faf Du Plessis Is Alright Collision With Mustafizur Rahman.. ఐపీఎల్ 2021లో సీఎస్‌కే దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సీఎస్‌కేకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సీఎస్‌కే విజయాలలో ఓపెనర్ల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఘనమైన ఆరంభానిస్తూ జట్టను పటిష్ట స్థితిలో నిలుపుతున్నారు. రుతురాజ్ ఈ సీజన్‌లో ఇప్పటికే 500 పరుగుల మార్క్‌ను దాటగా.. డుప్లెసిస్460 పరుగులతో టాప్ 5లో కొనసాగుతున్నాడు. అయితే తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ అనుకోకుండా గాయపడిన సంగతి తెలిసిందే.
చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే
Courtesy: IPL Twitter
సీఎస్‌కే బ్యాటింగ్ సమయంలో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో షాట్ ఆడిన డివిలియర్స్ పరుగు కోసం వచ్చాడు. అదే సమయంలో ముస్తాఫిజుర్ అక్కడే ఉండడం.. అతని కాళ్లకు డుప్లెసిస్ మెడ బలంగా తగలడంతో ఇద్దరు అక్కడే కూలబడ్డారు. అయితే డుప్లెసిస్ మెడకు గట్టిగా తగలడంతో కాసేపు అలానే కూర్చొండిపోయాడు. కాసేపటికి ఫిజియోథెరపీ వచ్చి అతని మెడకు మర్ధన చేశాడు. అయితే ఆ తర్వాత డుప్లెసిస్ తన ఇన్నింగ్స్‌కు కొనసాగించాడు. డుప్లెసిస్ గాయం తీవ్రత ఎంతనేది సీఎస్‌కే ఎక్కడ వెల్లడించలేదు. దీంతో డుప్లెసిస్ ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యం అభిమానులకు గుడ్‌న్యూస్ తెలిపింది. ''డుప్లెసిస్‌కు ఏం కాలేదని.. అతనిప్పుడు బాగానే ఉన్నాడని.. మెడనొప్పిపై తమకు ఏం చెప్పలేదని.. అతను నెట్స్‌లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించాడు.'' అంటూ సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా డుప్లెసిస్ ఫోటోను షేర్ చేస్తూ .. ''డుప్లెసిస్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు..'' అంటూ ట్విటర్‌లో తెలిపింది.
Courtesy: IPL Twitter]
కాగా పీఎస్‌ఎల్ 2021లో డుప్లెసిస్ ఇదే తరహాలో కంకషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా బంతిని అందుకునే ప్రయత్నంలో తోటి ఫీల్డర్‌తో జరిగిన కొలిషన్‌లో డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. 72 గంటల తర్వాత సీరియస్ ఇంజ్యురీ అని తేలడంతో డుప్లెసిస్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నప్పటికి మసక కంటిచూపుతో ఇబ్బంది పడడంతో హండ్రెడ్ టోర్నీకి పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. తాజాగా అదే తరహాలో డుప్లెసిస్ మరోసారి గాయపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డుప్లెసిస్‌కు ఏం కాలేదంటూ.. మిగతా మ్యాచ్‌లు ఆడుతాడని యాజమాన్యం స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: IPL 2021: వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్‌కే ఆటగాడికి కూడా పడుతుంది..!
— Maqbool (@im_maqbool) October 2, 2021
Comments
Please login to add a commentAdd a comment