
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల...
గుంటూరు, సాక్షి: ఏపీ మాజీ మంత్రి, దివం�...
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని �...
ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కేంద్రం, తమ�...
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మ...
Published Tue, Apr 12 2022 7:03 PM | Last Updated on Tue, Apr 12 2022 11:31 PM
IPL 2022: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు సీఎస్కే ఖాతా తెరిచింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ 41, దినేశ్ కార్తిక్ 34, ప్రభుదేశాయ్ 34 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో తీక్షణ 4, జడేజా 3, డ్వేన్ బ్రావో, ముఖేశ్ చౌదరీ చెరొక వికెట్ తీశారు.
సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి దిశగా పయనిస్తోంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రాయుడు స్టన్నింగ్ క్యాచ్‌కు ఆకాశ్ దీప్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ చేధనలో తడబడుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ 15, సుయాష్ ప్రభుదేశాయ్ 11 పరుగులతో ఆడుతున్నారు.
216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. మొదట 8 పరుగులు చేసిన డుప్లెసిస్ తీక్షణ బౌలింగ్‌లో జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప(50 బంతుల్లో 88,4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే(45 బంతుల్లో 95 నాటౌట్, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు ఆడారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. వీరిద్దరి దాటికి ఆర్సీబీ బౌలర్లు దారాళంగా పరుగులిచ్చకున్నారు. హాజిల్‌వుడ్ 1, హసరంగా రెండు వికెట్లు తీశాడు.
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఊతప్ప విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లోనే 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 88 పరుగులు చేశాడు. కాగా హసరంగా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఊతప్ప పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా గోల్డెన్ డక్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే జోరు కనబరుస్తోంది. ఊతప్ప, శివమ్ దూబేలు పోటీపడి పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అర్థశతకాలతో మెరవడంతో సీఎస్కే భారీ స్కోకు దిశగా పరిగెడుతుంది. ప్రస్తుతం 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఊతప్ప హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఊతప్ప 45, దూబే 39 పరుగులతో ఆడుతున్నారు.
9 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ఊతప్ప 21, శివమ్ దూబే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడు పరుగులు చేసిన మొయిన్ అలీ రనౌట్‌గా వెనుదిరగడంతో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో నాలుగో బంతిని మొయిన్ అలీ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న ప్రభుదేశాయ్ బంతి అందుకొని సూపర్ త్రో విసిరాడు. కార్తిక్ వికెట్లను గిరాటేయడంతో అలీ వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే రెండు వికెట్లు నష్టానికి 37 పరుగులు చేసింది
రుతురాజ్(17) రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రుతురాజ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. రుతురాజ్ 12, రాబిన్ ఊతప్ప 2 పరుగులతో ఆడుతున్నారు.
ఐపీఎల్ 2022లో మంగళవారం సీఎస్కే, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న సీఎస్కే ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలని భావిస్తోంది.
అయితే ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీద ఉంది. మరి ఆర్సీబీ జోరును సీఎస్కే అడ్డుకోగలదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇరజట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా సీఎస్కే అత్యధికంగా 18 సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment