
ఐపీఎల్-2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా నియమించింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత కేఎల్ రాహల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించింది.
కానీ అందుకు రాహుల్ సుముఖత చూపకపోవడంతో అక్షర్‌కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ యాజమాన్యం అప్పగించింది. ఐపీఎల్‌లలో అక్షర్ పటేల్ ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. కాగా అక్షర్ 2019 నుంచి డీసీ జట్టుతో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రూ. 16.50 కోట్ల భారీ ధర వెచ్చించి అక్షర్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అదేవిధంగా అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అతడికి బీసీసీఐ సెలక్టర్లు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అక్షర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. భారత్ టైటిల్ కైవసం చేసుకోవడంలో అక్షర్‌ది కీలక పాత్ర. . టీమిండియా తరఫున అక్షర్ పటేల్ 71 టీ20 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ పటేల్ 535 పరుగులతో పాటు, 71 వికెట్లు కూడా తీసుకున్నాడు. 150 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1653 పరుగులు చేసి 123 వికెట్లు తీసుకున్నాడు.
రాహుల్ విషెస్..
ఇక కెప్టెన్‌గా ఎంపికైన అక్షర్ పటేల్‌కు తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్‌కు అభినందనలు తెలిపాడు. "కంగ్రాట్స్ బాపు(అక్షర్ పటేల్). ఈ సరికొత్త ప్రయాణంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా వంతు సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది" అని రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
కాగా రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను లక్నో ఫ్రాంచైజీ విడుదల చేసింది. అతడి స్ధానంలో డైనమిక్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్సీ అప్పగించింది.
చదవండి: స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment