
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండగ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఐపీఎల్-2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్‌లో పాల్గోనే మొత్తం పది జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగమైన భారత ఆటగాళ్లు సైతం ఒక్కొక్కరుగా తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో చేరుతున్నారు. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే పది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇంకా తమ కెప్టెన్ వివరాలను వెల్లడించలేదు. గతసీజన్ వరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను ఐపీఎల్ మెగా వేలంలోకి ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది.
నో చెప్పిన రాహుల్..
ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ తమ జట్టు పగ్గాలను అప్పగిస్తుందని అంతాభావించారు. అంతా అనుకున్నట్లే అతడిని కెప్టెన్‌గా ఎంపికచేసేందుకు ఢిల్లీ యాజమాన్యం ముందుకు వచ్చింది.
కానీ రాహుల్ మాత్రం కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతానని సున్నితంగా తిరష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చెపడాతడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
రేసులో డుప్లెసిస్..
అయితే ఢిల్లీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిట్సల్ మెనెజ్‌మెంట్ డుప్లెసిస్‌ను పేరును పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా డుప్లెసిస్‌కు కెప్టెన్‌గా చాలా అనుభవం ఉంది. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్ వ్యవహరించాడు.
అతడు కెప్టెన్సీలో ఐపీఎల్-2022,24 సీజన్లలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆర్హత సాధించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడిని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..
ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్
చదవండి: Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment