
ఐపీఎల్-2025కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అదిరిపోయే వార్త అందింది. గత కొంతకాలంగా మెకాలి గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.12.50 కోట్ల భారీ ధరకు హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది.
34 ఏళ్ల హేజిల్‌వుడ్.. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ప్రక్కటెముకల గాయం బారిన పడ్డాడు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అతడు వైదొలగాడు. అనంతరం ఇదే గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. అయితే తాజాగా హాజిల్‌వుడ్‌కు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో హాజిల్‌వుడ్ ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ పొందినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్పీఎన్ వెల్లడించింది. అతడు త్వరలోనే భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశముంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా కన్పిస్తోంది.
ఆర్సీబీ బౌలింగ్ యూనిట్‌లో భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, జోష్ హేజెల్‌వుడ్ వంటి హేమహేమీలు ఉన్నారు. హాజిల్‌వుడ్ చివరగా 2023 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీకే ఆడాడు. ఇక ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి.
ఐపీఎల్-2025కు బెంగళూరు జట్టు
రజత్ పటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లియామ్ లివింగ్‌స్టన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫార్డ్, మనోజ్, జోష్ హేజెల్‌వుడ్, రషిక్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, లుంగీ ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్, యశ్ దయాల్.
Comments
Please login to add a commentAdd a comment