షాహీద్ ఆఫ్రీది కూతురుకు తీవ్ర అస్వస్థత
షాహీద్ ఆఫ్రీది కూతురుకు తీవ్ర అస్వస్థత
Published Thu, Dec 26 2013 6:43 PM | Last Updated on Sat, Mar 23 2019 8:48 PM
కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ షాహీద్ ఆఫ్రీది కూతురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అబుదాబీలో శ్రీలంకతో శుక్రవారం జరిగే వన్డే మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారులు కూడా ధృవీకరించారు. తన కూతురు ఆరోగ్యం పరిస్థితి బాగా లేకపోవడంతో మేనేజర్ మోయిన్ ఖాన్ ను అనుమతి తీసుకుని కరాచీ బయలు దేరాడు. తన కూతురి ఆరోగ్యం పక్కనే ఉండి చూసుకునేందుకు బోర్డు అధికారులు సానుకూలంగా స్పందించారు.
ఆఫ్రిదీ బ్యాట్ తోనే కాకుండా బంతితో కూడా రాణించడంతో ఇప్పటికే శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ ను పాక్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్రిది మ్యాచ్ నుంచి తప్పుకోవడానికి మరో కారణముందని కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు యువ క్రీడాకారులకు చోటు దక్కలేదని.. వారికి స్థానం కల్పించేందుకు మ్యాచ్ కు దూరమయ్యాడని బోర్డు సభ్యులు ద్వారా తెలిసింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో పాక్ 3-1 తేడాతో ముందంజలో ఉంది.
Advertisement