
గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏడాది తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును మంగళవారం ప్రకటించారు.
ఆర్చర్ పునరాగమనం చేయగా... జోస్ బట్లర్ కెపె్టన్‌గా కొనసాగుతాడు. మొయిన్ అలీ, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, స్యామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్‌లే, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు.