భారత్‌ను తొలి టీ20 వరల్డ్‌కప్‌లోనే విజేతగా నిలిపి, పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాను తిరుగులేని శక్తిగా తయారు చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఘోర అవమానం ఎదురైంది. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ విజ్డెన్ ఇండియా ప్రకటించిన భారత ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టులో మహేంద్రుడికి చోటు దక్కలేదు. 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించి, టీమిండియాకు గతంలో ఎన్నడూ లేనంత వైభవాన్ని అందించిన వ్యక్తికి ఆల్‌టైమ్ బెస్ట్ జట్టులో చోటు దక్కకపోవడంతో ధోని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా, బెస్ట్ వికెట్‌కీపర్‌గా, బెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తికి ఆల్‌టైమ్ బెస్ట్ జట్టులో చోటు లభించకపోవడంతో పెదవి విరుస్తున్నారు. ధోని విషయంలో విజ్డెన్ ఇండియా వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. ధోని స్థానంలో వికెట్‌కీపర్ కమ్ ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడం హాస్యాస్పదమని అంటున్నారు. అయితే ఈ విషయమై విజ్డెన్.. తమ లెక్కలు తమకున్నాయనట్లు వ్యవహరించింది. వికెట్‌కీపర్‌గా ధోని బెస్టే అయినప్పటికీ 6,7 స్థానాల్లో ధోనితో (121.15) పోలిస్తే డీకే (150.31) యావరేజ్ అత్యుత్తమంగా ఉందని తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది.
ఇదిలా ఉంటే, విజ్డెన్ ప్రకటించిన భారత ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టులో స్పిన్నర్ కోటాలో అశ్విన్‌కు, మిడిలార్డర్‌లో సురేశ్ రైనాకు చోటు దక్కడం విశేషం. పై పేర్కొన్న మూడు ఎంపికలు మినహా విజ్డెన్ ప్రకటించిన జట్టును భారత అభిమానులు స్వాగతిస్తున్నారు.
విజ్డెన్ ఆల్‌టైమ్ బెస్ట్ ఇండియా టీ20 ఎలెవెన్..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్ధిక్ పాండ్యా, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, వీరేంద్ర సెహ్వాగ్ (12వ ఆటగాడు)
Comments
Please login to add a commentAdd a comment