
సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ (పైల్)
సాక్షి, ముంబై: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సురేశ్ రైనా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన జయదేవ్ ఉనాద్కత్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన గత టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న శిఖర్ ధవన్ కూడా టీమ్‌లోకి వచ్చాడు. యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకున్నాడు.
దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన సీనియర్ ఆల్‌రౌండర్ సురేశ్ రైనాకు మళ్లీ అవకాశం దక్కింది. 31 ఏళ్ల రైనా గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో చివరిసారిగా ఆడాడు. యువరాజ్ సింగ్‌కు మరోసారి మొండిచేయి చూపారు. కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ ఛాన్స్ దక్కించుకున్నారు.
టీ20 టీమ్
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment