ఓ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు ఢిల్లీ టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎలా సాధ్యం అంటే.. అది అంతే. వివరాల్లోకి వెళ్తే మాదేపురా ఎంపీ రాజేష్ రంజన్ (పప్పుయాదవ్) కుమారుడు సర్థాక్ రంజన్ గత ఏడాది ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఢిల్లీ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు . అతుల్ వాసన్, హరి గిద్వానీ, జూనియర్ రాబిన్ సింగ్‌లతో కూడిన సెలక్షన్ కమిటీ గత ఏడాది నుంచి నిలకడగా రాణిస్తున్న ఇతర ఆటగాళ్లను పక్కన పెట్టీ మరీ సర్థాక్‌ను టీ20 జట్టుకు ఎంపిక చేసింది.
గతంలో కూడా సర్థాక్ ఎంపిక వివాదాస్పదమైంది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు చేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలోను ఇదే విధంగా ఎంపిక చేశారు. ఆ తరువాత రంజీ ట్రోఫీ ప్రాబుల్స్‌లో స్థానం లభించినా సర్థాక్ రంజన్ మాత్రం స్వతంత్రంగానే ఆ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోతోందంటూ బాడీ బిల్డింగ్ వైపు దృష్టి సారించాడు.
అయితే ఆశ్చర్యకరంగా సార్థక్ తల్లి రంజీత్ రాజన్ తన కుమారుడు ఇప్పుడు క్రికెట్ ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్‌కు ఈమెయిల్ రాశారు. దీంతో గత సీజన్ సీకే నాయుడు ట్రోఫీలో 91.58 స్టైక్ రేట్‌తో 468పరుగులు చేసిన హిటెన్ దళాల్ అనే ఆటగాడిని పక్కన పెట్టిమరీ సార్థక్ రంజన్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీకే నాయుడు ట్రోపీలో దళాల్ ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 468 పరుగులు చేశాడు. సగటు 52 కాగా, స్టైక్ రేటు 91.58 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment