
నార్త్ సౌండ్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 84 పరుగుల విజయలక్ష్యాన్ని వెస్టిండీస్ 22 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు 49/3తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో వికెట్ కోల్పోకుండా విజయానికి అవసరమైన పరుగులను సాధించింది. జాన్ క్యాంప్‌బెల్ (58 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, బ్లాక్‌వుడ్ (26 నాటౌట్; 2 ఫోర్లు) రాణించాడు. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన విండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..!
Comments
Please login to add a commentAdd a comment