సెయింట్ లూసియా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 13 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 2.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది. ఓవర్‌నైట్ స్కోరు 132/6తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకు ఆలౌటైంది. కేవలం 13 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగలగింది. బంగ్లా బ్యాటర్లలో నూరుల్ హసన్ (60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక విండీస్ బౌలర్లలో రోచ్, జోషఫ్, ఫిలిఫ్ తలా మూడు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కైల్ మైయర్స్(146) సెంచరీతో చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 5 వికెట్లు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కైల్ మైయర్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.
చదవండి: Ind Vs Eng 5th Test: "టీమిండియా ఓపెనర్‌గా గిల్ వద్దు.. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి"
Kyle Mayers takes the #MastercardPricelessMoment of the match with his stunning century!🔥 #WIvBAN pic.twitter.com/8C3EAYUzbR
— Windies Cricket (@windiescricket) June 27, 2022
Comments
Please login to add a commentAdd a comment