![Kemar Roach takes five as West Indies rout England for 77 - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/25/roch%5D.jpg.webp?itok=2H4c_3ze)
బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ పేసర్ కీమర్ రోచ్ (5/17) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను హడలగొట్టాడు. అతడి ధాటికి ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు గురువారం ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 77 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా వెస్టిండీస్‌కు 212 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు బర్న్స్ (2), జెన్నింగ్స్ (17), కెప్టెన్ రూట్ (4), బెయిర్ స్టో (12), స్టోక్స్ (0), మొయిన్ అలీ (0), బట్లర్ (4), ఫోక్స్ (2) అంతా విఫలమయ్యారు. రోచ్ ఐదు వికెట్లను 31 బంతుల వ్యవధిలో 9 పరుగులిచ్చి పడ గొట్టడం విశేషం. అంతకుముందు ఆతిథ్య జట్టు 289 పరుగులకు ఆలౌటైంది. హెట్‌మైర్ (81; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడైన ఇన్నింగ్స్, షై హోప్ (57), చేజ్ (54) అర్ధ సెంచరీలతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అండర్సన్ (5/46)కు ఐదు, స్టోక్స్ (4/59)కు నాలుగు వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment