18 నెలలు తరువాత టెస్టు జట్టులోకి.. | West Indies recall fast bowler Kemar Roach for England tour | Sakshi
Sakshi News home page

18 నెలలు తరువాత టెస్టు జట్టులోకి..

Published Sun, Jul 16 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

18 నెలలు తరువాత టెస్టు జట్టులోకి..

18 నెలలు తరువాత టెస్టు జట్టులోకి..

ఆంటిగ్వా:సుదీర్ఘ విరామం తరువాత వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్కు జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కింది. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో చివరిసారి కనిపించిన రోచ్.. ఇంగ్లండ్ కు పయనమయ్యే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గత కొంతకాలంగా దేశవాళీ మ్యాచ్ ల్లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్న రోచ్ ను ఇంగ్లండ్ తో ఆడే మూడు టెస్టులకు ఎంపిక చేస్తూ విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెస్టు జట్టును శనివారం ప్రకటించారు.

 

టెస్టు అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన రో్చ్ ను ఎంపిక చేయడానికి అతని ఫామ్ కారణమని విండీస్ సెలక్షన్ చైర్మన్ కర్ట్నీ బ్రౌన్ తెలిపారు. ఇప్పటివరకూ 37 టెస్టుల్లో ఆడిన రోచ్ 122 వికెట్లు సాధించాడు. దాదాపు 18 నెలలు తరువాత రోచ్ కు తిరిగి జట్టులో స్థానం దక్కడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement