కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్! | Windies speedster Kemar Roach escapes serious injury in accident | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్!

Published Sun, Apr 20 2014 3:40 PM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్! - Sakshi

కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్!

బ్రిడ్జ్ టౌన్: వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కేమర్ రోచ్ కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. రోచ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ వాహనం అదుపుతప్పడంతో బ్రిడ్జ్ టౌన్ నగర శివారులోని వన్స్టీడ్ డ్రైవ్ సమీపంలో శనివారం ప్రమాదానికి గురైంది.
 
ఓవల్ క్రికెట్ స్టేడియానికి సమీపాన జరిగిన ఈ ప్రమాదంలో కారు పలుమార్లు పల్టీలు కొట్టిందని బార్బోడోస్ చెందిన వెబ్ సైట్ తెలిపింది. ఈ ప్రమాదంలో రోచ్ తలకు గాయమైందని... ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు.
 
వెస్టిండీస్ తరపున 23 టెస్టులు, 61 వన్డేలు ఆడిన రోచ్ గాయం కారణంగా ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement