విండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ కన్నుమూత
జమైకా : విండీస్ లెజెండరీ బ్యాట్స్మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన 95 ఏళ్ల ఎవర్టన్ వీక్స్ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 1948- 58 మధ్య 48 టెస్టులాడిన ఎవర్టన్ 58.61 స్ట్రైక్‌రేట్‌తో 4,455 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 19 అర్థ సెంచరీలు ఉన్నాయి. కాగా ఎవర్టన్ మృతిపై కరీబియన్ జట్టు స్పందిస్తూ.. ' ది లెజెండ్ సర్ ఎవర్టన్ వీక్స్.. మిమ్మల్ని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఒక దిగ్గజ ఆటగాడు వదిలివెళ్లడం మా గుండెల్ని పిండేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఎవర్టన్ కుటుంబానికి ఇవే మా ప్రగాడ సానభూతి. ' అంటూ ట్వీట్ చేసింది.
1950వ దశకంలో క్లైడ్ వాల్కాట్, ఫ్రాంక్ వొరెల్, ఎవర్టన్ వీక్స్‌లు త్రీ డబ్యుఎస్గా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురిలో వాల్కట్ 2006లో, వొరెల్ 1967లో మృతి చెందగా.. తాజాగా ఎవర్టన్ మరణంతో త్రీ డబ్యుస్ శకానికి ముగింపు పలికినట్లయింది. వీరి సేవలకు గుర్తుగా విండీస్ క్రికెట్ బోర్డు బ్రిడ్జ్‌టౌన్‌లోని నేషనల్ స్టేడియం పేరుకు త్రీ డబ్యుఎస్గా నామకరణం చేశారు.