IPL 2024: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఒకే బంతికి 14 పరుగులు | IPL 2024 LSG Vs KKR: Shamar Josephs IPL Debut Turns Into Nightmare, See More Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఒకే బంతికి 14 పరుగులు

Published Sun, Apr 14 2024 10:46 PM | Last Updated on Mon, Apr 15 2024 11:47 AM

Shamar Josephs IPL Debut Turns into Nightmare - Sakshi

వెస్టిండీస్ సంచలన ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ తన ఐపీఎల్‌ కెరీర్‌ను పేలవంగా ప్రారంభించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరపున జోషెఫ్‌ ఈ క్యాచ్‌రిచ్‌ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో జోషెఫ్‌ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు.

ఈ మ్యాచ్‌లో షమర్‌ తన  4 ఓవర్ల కోటాలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. జోషఫ్‌ కనీసం ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయాడు. అదేవిధంగా కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన జోషఫ్‌ ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తన తొలి ఓవర్‌లో ఏకంగా జోషఫ్‌ 10 బంతులు వేశాడు.

తొలి 5 బంతుల్లో 7 పరుగులు ఇచ్చి పర్వాలేదన్పించిన జోషఫ్‌.. ఆఖరి బంతికి ఓవర్‌స్టెప్‌ చేశాడు. దీంతో అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత వరుసగా రెండు బంతులను వైడ్‌గా వేశాడు. అందులో ఒకటి వైడ్‌గా వెళ్లి బౌండరీ దాటింది. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత కూడా మళ్లీ నోబాల్‌ వేశాడు.

ఆఖరికి ఫ్రీహిట్‌ బంతిని సాల్ట్‌ సిక్స్‌గా మలిచాడు. దీంతో చివరి బంతి వేసే క్రమంలో జోషఫ్‌ ఏకంగా 14 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును జోషఫ్‌ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆరో బౌలర్‌గా ఈ కరేబియన్‌ పేసర్‌ నిలిచాడు. ఈ జాబితాలో అబు నెచిమ్ 27 పరుగులతో అగ్రస్ధానంలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement