ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.
కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్ల పడగొట్టగా.. రస్సెల్ రెండు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు.
అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment