వెస్టిండీస్‌ సంచలన బౌలర్‌కు బంపరాఫర్‌.. ఏకంగా ఐపీఎల్‌లో!? | Shamar Joseph On Royal Challengers Bangalores Radar For IPL 2024: Reports - Sakshi
Sakshi News home page

IPL 2024: వెస్టిండీస్‌ సంచలన బౌలర్‌కు బంపరాఫర్‌.. ఏకంగా ఐపీఎల్‌లో!?

Published Fri, Feb 2 2024 8:32 AM | Last Updated on Fri, Feb 2 2024 9:27 AM

Shamar Joseph on Royal Challengers Bangalores radar for IPL 2024: Reports - Sakshi

వెస్టిండీస్‌ నయా పేస్‌ సంచలనం షమర్ జోసెఫ్.. ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జోషఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌-2024లో వేలంలో ఆ‍ర్సీబీ సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ టామ్ కుర్రాన్‌ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.

అతడు త్వరలో జరగనున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు కూడా దూరమమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్రాన్‌ ప్రత్యామ్నాయంగా జోషఫ్‌ తీసుకోవాలని ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. కుర్రాన్‌ను రూ.1.5 కోట్ల బేస్‌ ప్రైస్‌కు ఆర్సీబీ సొంతం చేసుకుంది. 

ఇక ప్రతష్టత్మక గబ్బా స్టేడియంలో జోషఫ్‌ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి విండీస్‌కు చారిత్రత్మక విజయం అందించాడు. జోషప్‌ బొటన వేలు గాయంతో బాధపడుతూనే ఆసీస్‌కు తమ సొంత గడ్డపై చుక్కలు చూపించాడు. ఈ ప్రదర్శనతో జోషఫ్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోయాడు.

ఈ క్రమంలో అతడికి ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్‌ ఫ్రాంచైజీలు నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి.  పాకిస్తాన్‌ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ షమీర్‌తో ఒప్పందం కుదుర్చుకోగా.. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ ఓ ఫ్రాంచైజీ కూడా అతడిని తమ జట్టులోకి చేర్చుకుంది.  కానీ బొటన వేలి గాయం కారణంగా ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌కు షమర్‌ దూరమయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement