బ్రిస్బేన్ వేదికగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ను గెలుపు ఊరిస్తుంది. యువ పేసర్ షమార్ జోసఫ్ (6/65) ధాటికి ఆసీస్ ఓటమి దిశగా పయనిస్తుంది. లక్ష్య ఛేదనలో ఆ జట్టు 191 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. స్టీవ్ స్మిత్ (90 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. స్మిత్‌కు జతగా హాజిల్‌వుడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు.
బొటన వేలు విరిగినా ఇరగదీసిన షమార్..
సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో స్టార్క్ బౌలింగ్ విండీస్ ఆటగాడు షమార్ జోసఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్టార్క్ సంధించిన యార్కర్ నేరుగా షమార్ కాలి బొటన వేలిని తాకింది. దీంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. స్వల్పంగా ఫ్రాక్చర్ ఉందని డాక్టర్లు చెప్పినా షమార్ బౌలింగ్‌కు దిగాడు. బౌలింగ్ చేయడమే కాకుండా ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. షమార్‌తో పాటు అల్జరీ జోసఫ్ (2/50), జస్టిన్ గ్రీవ్స్ (1/46) వికెట్లు తీయడంతో ఆసీస్ ఓటమి దిశగా పయనిస్తుంది.
Shamar Joseph has to retire hurt after this toe-crusher from Mitch Starc!
— cricket.com.au (@cricketcomau) January 27, 2024
Australia need 216 to win #AUSvWI pic.twitter.com/3gAucaEfwg
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హాడ్జ్ (71), జాషువ డసిల్వ (79), కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్ నాలుగు, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు, నాథన్ లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఉస్మాన్ ఖ్వాజా (75), అలెక్స్ క్యారీ (65), కమిన్స్ (64 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు.
Shamar Joseph helped from the field to end West Indies’ innings #AUSvWI pic.twitter.com/YZPUcmQ7s6
— Andrew McGlashan (@andymcg_cricket) January 27, 2024
విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్, కెవిన్ సింక్లెయిర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్‌కెంజీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్, లయోన్ తలో మూడు వికెట్లు, గ్రీన్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment