
2024 జనవరి మాసం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్, విండీస్ సంచలన బౌలర్ షమార్ జోసఫ్ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్‌లో అమీ హంటర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేషన్ దక్కించుకున్నారు. ఓటింగ్ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు.
ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్ దక్కింది..
షమార్ జోసఫ్: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్ యువ పేసర్ షమార్, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.
జోష్ హాజిల్‌వుడ్: జనవరి నెలలో విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో హాజిల్‌వుడ్ సైతం విజృంభించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్‌వుడ్ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు.
ఓలీ పోప్: ఈ ఇంగ్లీష్ బ్యాటర్ జనవరిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (హైదరాబాద్ టెస్ట్) పోప్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment