west indies cricket board
-
విండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. గత సీజన్లో కనబరిచిన అసాధారణ ప్రదర్శన ఆధారంగా తొమ్మిది మంది క్రికెటర్లకు ఏకంగా రెండేళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. కాగా సాధారణంగా ఏ క్రికెట్ బోర్డు అయినా తమ ఆటగాళ్లకు ఏడాది పాటే కాంట్రాక్టే ఇస్తుంది. రెండేళ్ల కాంట్రాక్టు పొందినది వీరేప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సంవత్సరకాలానికే సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తుంది. ఆ ఏడాదికి సంబంధించిన ఆటతీరును బట్టే తదుపరి ఏడాది గ్రేడ్‌ను నిర్ణయించి కాంట్రాక్టు ఖరారు చేస్తుంది. అయితే, విండీస్ బోర్డు ఇందుకు భిన్నంగా రెండేళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం విశేషం. ఈ జాబితాలో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇక.. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 15 మంది చొప్పున మహిళా, పురుషుల క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు కట్టబెట్టింది. అదనపు కాంట్రాక్టు పొందిన వారిలో పురుషుల జట్టు వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, పేస్ నయా సంచలనం షమర్ జోసెఫ్, హిట్టర్లు షై హోప్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, సిలెస్ ఉన్నారు. మిగతా వారికి ఏడాదికేఅదే విధంగా.. మహిళల జట్టుకు సంబంధించి కెప్టెన్ హేలీ మాథ్యూస్, వైస్ కెప్టెన్ షెమైన్ క్యాంప్‌బెల్, స్టెఫానీ టేలర్ ఉన్నారు. 15 మందిలో ఎంపికైన మిగతా వారికి ఎప్పట్లాగే ఏడాది కాంట్రాక్టు లభించింది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకొన్న సౌతాఫ్రికా స్టార్ -
శామ్యూల్స్ డబుల్ ధమాకా
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించే అవార్డులలో శామ్యూల్స్ పంట పండింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సీనియర్ ప్లేయర్ మర్లోన్ శాయ్యూల్స్ సొంతం చేసుకున్నాడు. ఆంటిగ్వాలో విండీస్ బోర్డు అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విండీస్ గెలవడంతో కీలకపాత్ర పోషించడంతో పాటు గత ఏడాది కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న శామ్యూల్స్ కు అవార్డు ప్రకటించి గౌరవించాలని బోర్డు భావించింది. 2015లో 22 వన్డేలాడిన శామ్యూల్స్ 3 సెంచరీల సాయంతో 859 పరుగులు చేశాడు. టీ20 ఫైనల్లో ఛేజింగ్ లో బ్యాటింగ్ కు దిగిన ఈ ఆటగాడు కేవలం 66 బంతుల్లో 85 పరుగులు చేసి విండీస్ ను పొట్టి క్రికెట్లో మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. మహిళల విభాగంలో స్టెఫానీ టేలర్‌కు టీ20 ప్లేయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కైవసం చేసుకుంది. -
పాకిస్థాన్ కు షాకిచ్చిన విండీస్
కరాచీ: పాకిస్థాన్ లో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు వెస్టిండీస్ వెనుకడుగు వేసింది. తమ దేశంలో ఆడేందుకు విండీస్ నిరాకరించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిరాశ చెందింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న వెస్టిండీస్ టీమ్ సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్థాన్ తో యూఏఈలో సిరీస్ ఆడేందుకు అంగీకరించింది. అయితే సిరీస్ భాగంగా కొన్ని పరిమిత ఓవర్ల మ్యాచ్ లు తమ దేశంలో ఆడాలని విండీస్ ను పీసీబీ కోరింది. అయితే భద్రతా కారణాలతో పాకిస్థాన్ లో ఆడేందుకు విండీస్ ఒప్పుకోలేదు. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు నుంచి తమకు వర్తమానం అందిందని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విండీస్ నిర్ణయం తమకు తీవ్రనిరాశ కలిగించిందన్నారు. యూఏఈలో జరగనున్న సిరీస్ లో పాక్-విండీస్ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనున్నాయి. 2009, మార్చిలో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్ లో తీవ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి పాకిస్థాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు క్రికెట్ దేశాలు జంకుతున్నాయి. -
పాకిస్తాన్లో విండీస్ పర్యటన?
సిరీస్‌పై పీసీబీ ఆశాభావం కరాచీ: గత ఏడేళ్లుగా పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు పెద్ద జట్లను ఒప్పించడంలో విఫలమైన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. తాజాగా దీనిపై పీసీబీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇరు జట్ల మధ్య వచ్చే సెప్టెంబర్‌లో యూఏఈలో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో కొన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లోనే ఆడితే బాగుంటుందని విండీస్‌కు పాక్ విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై విండీస్ దిగ్గజాలు రిచర్డ్స్, లారా తమ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ దేశంలో ఆడితే విండీస్ క్రికెటర్లకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించేందుకు కూడా పీసీబీ సిద్ధమైంది. 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో మరే పెద్ద జట్టు అడుగు పెట్టలేదు. -
వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఆటగాళ్లకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి మద్దతు లభించింది. వారి ఆవేదనను బోర్డు పట్టించుకోవాలని సూచించారు. ‘మైదానం బయట, లోపల సవాళ్లను ఎదుర్కొంటూ వెస్టిండీస్ ఆటగాళ్లు నిజమైన చాంపియన్లుగా నిలిచారు. ఈ సమయంలో విండీస్ బోర్డు తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలి’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
జీతాల సమస్య పరిష్కారం!
కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన 12 మంది విండీస్ ఆటగాళ్లు సెయింట్ జాన్స్: జీతాల చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ), ఆటగాళ్లకు మధ్య తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు పరిష్కారమైంది. బోర్డు తాజా కాంట్రాక్ట్‌పై 12 మంది క్రికెటర్లు సంతకాలు కూడా చేశారు. దీంతో టి20 ప్రపంచకప్‌లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. అయితే డారెన్ బ్రేవో మాత్రం టెస్టులపై దృష్టిపెట్టేందుకు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. గేల్, స్యామీ, బెన్, హోల్డర్, ఫ్లెచర్, బ్రేవో, బద్రీ, సిమ్మన్స్, టేలర్, రస్సెల్, శామ్యూల్స్, రామ్‌దిన్ సంతకాలు చేసిన వారిలో ఉన్నారని విండీస్ బోర్డు తెలిపింది. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న పొలార్డ్ (గాయం), నరేన్ (సందేహాస్పద బౌలింగ్)ల స్థానంలో ఆష్లే నర్స్, కార్లోస్ బ్రాత్‌వైట్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే డారెన్ స్థానంలో త్వరలోనే మరొకర్ని తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. ఐసీసీ నుంచి ఒత్తిడి లేదు: పాక్ కరాచీ: భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనాల్సిందిగా ఐసీసీ నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ అనుమతిపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉందని తేల్చింది. టోర్నీ నుంచి వైదొలిగితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఇటీవల హెచ్చరించినట్టు కథనాలు వెలువడడంతో పీసీబీ స్పందించింది. ‘ఐసీసీ నుంచి మాకెలాంటి సమాచారం లేదు. ఇటీవలి సమావేశంలోనూ భారత్‌లో పాక్ ఆటగాళ్ల భద్రతపై చర్చించాం. ఇదే కారణంగా పాక్ ప్రభుత్వం జట్టుకు అనుమతినివ్వకపోతే పీసీబీ చేసేదేం లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఏ విషయమూ తేల్చలేదు’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. -
త్వరలోనే ‘విండీస్’ సమస్య పరిష్కారమవుతుంది: దాల్మియా
కోల్‌కతా: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) చెల్లించాల్సిన నష్ట పరిహారంపై త్వరలోనే వారి అధికారులతో చర్చలు జరపనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తెలిపారు. గత అక్టోబర్‌లో భారత పర్యటనలో ఉన్న విండీస్ జట్టు తమ బోర్డుతో ఏర్పడిన విభేదాల కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి పయనమైంది. దీంతో తమకు నష్టపరిహారంగా 41.97 మిలియన్ డాలర్ల (రూ.269 కోట్లు)ను చెల్లించాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. ‘క్రికెట్ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని ఆశిస్తున్నాను. వర్కింగ్ కమిటీలో కూడా గతంలో ఇదే విషయం చర్చించాం’ అని దాల్మియా అన్నారు. -
2 నెలలు సమయం ఇవ్వండి
బీసీసీఐని కోరిన వెస్టిండీస్ జమైకా: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగినందుకు నష్టపరిహారం చెల్లించే విషయంలో... తమకు రెండు నెలలు సమయం కావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత బోర్డు (బీసీసీఐ)ని కోరింది. మధ్యవర్తిత్వం ద్వారా లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు నెలల్లోపే ఈ సమస్యను ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డు అధ్యక్షుడు కామెరాన్ బీసీసీఐకి లేఖ రాశారు. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. -
వీలైనంత త్వరగా చెల్లించండి
నష్టపరిహారంపై విండీస్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం న్యూఢిల్లీ: నష్టపరిహారం చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కు బీసీసీఐ మరోసారి అల్టిమేటం జారీ చేసింది. గతేడాది భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నందుకు ఆగ్రహం చెందిన బోర్డు నష్టపరిహారం కింద 41.97 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా ఇంతకుముందే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో 40 రోజుల పాటు గడువు కావాల్సిందిగా డబ్ల్యూఐసీబీ తరఫున మధ్యవర్తిత్వం చేసిన అంతర్గత ప్రభుత్వ కరీబియన్ కమ్యూనిటీ (క్యారికామ్) అభ్యర్థన మేర కు బీసీసీఐ మెత్తబడింది. తాజాగా విండీస్ బోర్డు అధ్యక్షుడు డే వ్ కామెరూన్, క్యారికామ్ ప్రధాన కార్యదర్శి ఇర్విన్ లారోక్లకు బీసీసీఐ లేఖలు రాసింది. ‘గతంలో మీకు రాసిన లేఖపై ఏడు రోజుల్లోగా స్పందించకుంటే భారత కోర్టుల్లో న్యాయపరంగా ముందుకెళతాం. క్యారికామ్ జోక్యంతో సమస్య పరిష్కారమవుతుందని అనుకున్నాం. గడువు ఎప్పుడో ముగిసినా పరిస్థితిలో మార్పు లేదు’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. -
పరిష్కారం దిశగా విండీస్ సంక్షోభం!
కాంట్రాక్ట్‌లపై మళ్లీ చర్చించనున్న ఇరు పక్షాలు పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర సంక్షోభానికి కారణమైన ఆటగాళ్ల ఫీజు చెల్లింపు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) సమావేశంలో సభ్యులంతా దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని ప్రకారం సాధ్యమైనంత త్వరగా విండీస్ బోర్డు, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య కొత్త కాంట్రాక్ట్‌కు సంబంధించి మరో సారి చర్చలు జరగనున్నాయి. అయితే ఆటగాళ్ల ప్రతినిధిగా మాత్రం వేవెల్ హైండ్స్ కొనసాగే అవకాశం ఉంది. భారత పర్యటన నుంచి విండీస్ జట్టు అర్ధాంతరంగా నిష్ర్కమించడంతో బీసీసీఐ రూ. 250 కోట్ల నష్ట పరిహారం కోరిన సంగతి తెలిసిందే. దీంతో పాటు త్వరలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు కూడా అన్నీ చక్కబెట్టి పూర్తి స్థాయి జట్టును పంపాలని కూడా విండీస్ బోర్డు భావిస్తోంది. మరో వైపు సమస్యను పరిష్కరించడంలో విండీస్ బోర్డు విఫలమైందంటూ వన్డే జట్టు కెప్టెన్ డ్వేన్ బ్రేవో చేసిన వ్యాఖ్యలపై, ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కామెరాన్ బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. -
విండీస్ బోర్డులో కలవరం!
బీసీసీఐతో సమావేశమవ్వాలని నిర్ణయం బార్బడోస్: బీసీసీఐ పెద్దరికం, అధికారం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)ను కలవరపెట్టినట్లున్నాయి. భారత బోర్డుతో ఢీకొంటే మనుగడ సాగించలేమని కూడా వారికి అర్థమైంది. పర్యటనలు రద్దు, భారీ పరిహారంలాంటి నిర్ణయాలతో ఉలిక్కి పడ్డ డబ్ల్యూఐసీబీ భారత క్రికెట్ బోర్డును ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. బీసీసీఐతో వెంటనే ప్రత్యేకంగా సమావేశం కావాలని విండీస్ బోర్డు నిర్ణయించింది. సిరీస్ నుంచి నిష్ర్కమణవంటి పరిణామాలు దురదృష్టకరమని పేర్కొంటూ నష్టనివారణకు సిద్ధమైంది. మంగళవారం ఇక్కడ ఎనిమిది గంటల పాటు జరిగిన సమావేశంలో డబ్ల్యూఐసీబీ సుదీర్ఘంగా చర్చించింది. స్నేహం కొనసాగాలి... సమావేశం అనంతరం విండీస్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘సిరీస్‌నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బోర్డును చాలా ఇబ్బంది పెట్టింది. జరిగిన పరిణామాలపై విచారణ జరిపేందుకు కీలక సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో... బీసీసీఐతో సమావేశం కావాలని భావిస్తున్నాం. విండీస్‌పై తీవ్ర ప్రభావం చూపే భారత బోర్డు నిర్ణయాలపై ఆ సమావేశంలో చర్చిస్తాం. జరిగిన నష్టాన్ని పూరించేందుకు పరిష్కార మార్గం లభిస్తుందని భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. కీలక సమయంలో సంయమనంగా వ్యవహరించిన ఐసీసీ, బీసీసీఐ, ప్రసారకర్తలు, స్పాన్సర్లకు మా కృతజ్ఞతలు. భారత బోర్డుతో పాత స్నేహం కొనసాగుతుందని నమ్ముతున్నాం’ అని డబ్ల్యూఐసీబీ ఆ ప్రకటనలో తెలిపింది. దీనిపై బీసీసీఐ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. విండీస్ బోర్డుపై ఐసీసీ చర్యలు! భారత పర్యటననుంచి వెస్టిండీస్ జట్టు అర్ధాంతరంగా వైదొలగిన వ్యవహారంపై ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకోనుంది. నవంబర్ 10న జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తారు. ‘సామరస్య పద్ధతిలోనే దీనికి పరిష్కారం కనుగొంటాం’ అని ఐసీసీ తన మీడియా ప్రకటనలో పేర్కొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వెస్టిండీస్ జట్టును ఐసీసీ సస్పెండ్ చేయాలనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు 2015 వన్డే ప్రపంచకప్‌లో విండీస్‌కు దక్కాల్సిన పార్టిసిపేషన్ ఫీజును బీసీసీఐకి బదలాయించవచ్చు. అయితే ఇది ద్వైపాక్షిక సిరీస్ కావడంతో బీసీసీఐ అభ్యర్థన మేరకే ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
ఆంబ్రోస్ చెబితేనే ఆడారు
ముంబై: తమ దేశ క్రికెట్ బోర్డు వ్యవహార శైలితో విసిగిపోయిన వెస్టిండీస్ జట్టు భారత్‌తో నాలుగో వన్డేను ఎట్టి పరిస్థితిల్లోనూ ఆడకూడదని నిర్ణయించకుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశానికి ఆలస్యంగా రావడమే కాకుండా గురువారం ప్రాక్టీస్‌కు కూడా రాలేదు. విషయం తెలుసుకున్న బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఎంత బతిమాలినా కూడా వారు వినలేదు. అయితే ఈ దశలో విండీస్ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న కర్ట్లీ ఆంబ్రోస్ రంగప్రవేశంతో సీన్ మారింది. అర్ధగంట సేపు డ్వేన్ బ్రేవో బృందంతో మాట్లాడి ధర్మశాల వన్డేను ఆడించేలా ఒప్పించారు. ఇక్కడిదాకా వచ్చి మ్యాచ్‌కు దూరమైతే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం సన్నాహకాలు దెబ్బతింటాయని, మ్యాచ్ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫర్లేదని సూచించారు. దీంతో వెనక్కితగ్గిన ఆటగాళ్లు అందుకు సమ్మతించారు. -
టెస్టులకు స్యామీ గుడ్‌బై
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా, బార్బుడా): వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ స్యామీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు స్యామీ శుక్రవారమే తమకు సమాచారం అందించినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే మిగిలిన రెండు ఫార్మాట్లలో ఆడతానని, టి20 జట్టు సారథిగా కొనసాగుతానని చెప్పినట్లు పేర్కొంది. విండీస్ టెస్టు జట్టు కెప్టెన్‌గా తన స్థానంలో వికెట్‌కీపర్ రామ్‌దిన్‌ను నియమించిన కొద్ది గంటల్లోనే స్యామీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం విశేషం. 2010 అక్టోబర్‌లో విండీస్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన స్యామీ.. 30 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. కెరీర్లో మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1323 పరుగులు చేసి 84 వికెట్లు తీసుకున్నాడు. -
భారత పర్యటనకు ఓకే అంగీకరించిన విండీస్ బోర్డు
సయింట్ జాన్స్ (అంటిగ్వా): మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. నవంబర్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత్‌కు రావాలని చేసిన ప్రతిపాదనకు విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) సానుకూలంగా స్పందించింది. నవంబర్‌లో రెండు జట్లకు లభించే ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునేందుకు బీసీసీఐతో పాటు విండీస్ కూడా అంగీకరించింది. వాంఖడేలో 200వ టెస్టు! ముంబై: సచిన్ ఆడబోయే 200వ టెస్టును వాంఖడేలో నిర్వహించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కోరుకుంటోంది. ఇందుకోసం బీసీసీఐకి ఓ విజ్ఞప్తిని పంపుతామని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి నితిన్ దలాల్ అన్నారు. బోర్డు రొటేషన్ పాలసీ ప్రకారం ఇది సాధ్యం కాకపోయినా... సచిన్ కోసం ముంబైలోనే మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం ఉంది.