నష్టపరిహారంపై విండీస్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం
న్యూఢిల్లీ: నష్టపరిహారం చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కు బీసీసీఐ మరోసారి అల్టిమేటం జారీ చేసింది. గతేడాది భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నందుకు ఆగ్రహం చెందిన బోర్డు నష్టపరిహారం కింద 41.97 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా ఇంతకుముందే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో 40 రోజుల పాటు గడువు కావాల్సిందిగా డబ్ల్యూఐసీబీ తరఫున మధ్యవర్తిత్వం చేసిన అంతర్గత ప్రభుత్వ కరీబియన్ కమ్యూనిటీ (క్యారికామ్) అభ్యర్థన మేర కు బీసీసీఐ మెత్తబడింది.
తాజాగా విండీస్ బోర్డు అధ్యక్షుడు డే వ్ కామెరూన్, క్యారికామ్ ప్రధాన కార్యదర్శి ఇర్విన్ లారోక్‌లకు బీసీసీఐ లేఖలు రాసింది. ‘గతంలో మీకు రాసిన లేఖపై ఏడు రోజుల్లోగా స్పందించకుంటే భారత కోర్టుల్లో న్యాయపరంగా ముందుకెళతాం. క్యారికామ్ జోక్యంతో సమస్య పరిష్కారమవుతుందని అనుకున్నాం. గడువు ఎప్పుడో ముగిసినా పరిస్థితిలో మార్పు లేదు’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు.
వీలైనంత త్వరగా చెల్లించండి
Published Sun, Jan 25 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM
Advertisement