టెస్టులకు స్యామీ గుడ్‌బై | Darren Sammy goodbye to Test Cricket | Sakshi
Sakshi News home page

టెస్టులకు స్యామీ గుడ్‌బై

Published Sun, May 11 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

టెస్టులకు స్యామీ గుడ్‌బై

టెస్టులకు స్యామీ గుడ్‌బై

 సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా, బార్బుడా): వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ స్యామీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు స్యామీ శుక్రవారమే తమకు సమాచారం అందించినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే మిగిలిన రెండు ఫార్మాట్లలో ఆడతానని, టి20 జట్టు సారథిగా కొనసాగుతానని చెప్పినట్లు పేర్కొంది. విండీస్ టెస్టు జట్టు కెప్టెన్‌గా తన స్థానంలో వికెట్‌కీపర్ రామ్‌దిన్‌ను నియమించిన కొద్ది గంటల్లోనే స్యామీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం విశేషం. 2010 అక్టోబర్‌లో విండీస్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన స్యామీ.. 30 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. కెరీర్‌లో మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1323 పరుగులు చేసి 84 వికెట్లు తీసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement