సయింట్ జాన్స్ (అంటిగ్వా): మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. నవంబర్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత్‌కు రావాలని చేసిన ప్రతిపాదనకు విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) సానుకూలంగా స్పందించింది. నవంబర్‌లో రెండు జట్లకు లభించే ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునేందుకు బీసీసీఐతో పాటు విండీస్ కూడా అంగీకరించింది.
వాంఖడేలో 200వ టెస్టు!
ముంబై: సచిన్ ఆడబోయే 200వ టెస్టును వాంఖడేలో నిర్వహించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కోరుకుంటోంది. ఇందుకోసం బీసీసీఐకి ఓ విజ్ఞప్తిని పంపుతామని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి నితిన్ దలాల్ అన్నారు. బోర్డు రొటేషన్ పాలసీ ప్రకారం ఇది సాధ్యం కాకపోయినా... సచిన్ కోసం ముంబైలోనే మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం ఉంది.
భారత పర్యటనకు ఓకే అంగీకరించిన విండీస్ బోర్డు
Published Thu, Sep 5 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement