సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) బీభత్సం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీ20ను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. భారత్ 59 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్.. ఎదురుదాడికి దిగాడు.
ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఢిల్లీ ఆటగాడు ఉతికారేశాడు. కేవలం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184.85 స్ట్రైక్ రేట్‌తో 61 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేసిన పంత్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టమైన వికెట్‌పై రిషబ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ కొనియాడు.
"సిడ్నీలో రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ కఠినమైన వికెట్‌పై మిగితా బ్యాటర్లు 50 కంటే తక్కువ స్ట్రైక్ రేటుతో ఆడితే.. పంత్ మాత్రం ఏకంగా 184 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు.
ఇది నిజంగా నమ్మశక్యం కానిది. తొలి బంతి నుంచే ఆస్ట్రేలియా బౌలర్లను అతడు టార్గెట్ చేశాడు. పంత్ ఎప్పుడూ తన బ్యాటింగ్‌తో అందరిని అలరిస్తూ ఉంటాడు. అతడు ఇన్నింగ్స్ ఎంతో ప్రభావం చూపుతోందని" సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహా యాజమాని పార్ధ్ జిందాల్ సైతం రిషబ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తుమ టెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అని అతడు ప్రశంసించాడు.
కాగా ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించిన పంత్.. ఈ సారి లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడనున్నాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో పంత్‌ను సొంతం చేసుకుంది.
On a wicket where majority of the batters have batted at a SR of 50 or less, @RishabhPant17's knock with a SR of 184 is truly remarkable. He has rattled Australia from ball one. It is always entertaining to watch him bat. What an impactful innings!#AUSvIND pic.twitter.com/rU3L7OL1UX
— Sachin Tendulkar (@sachin_rt) January 4, 2025
Introducing to you the greatest Indian test wicketkeeper batsman in our history come on @RishabhPant17 come on India!
— Parth Jindal (@ParthJindal11) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment