సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh pant) అద్బుతమైన పోరాటం కనబరిచాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లతో ముప్పుతిప్పులు పెడుతున్నప్పటికీ.. పంత్ మాత్రం తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దెబ్బకు మోచేతిపై కాస్త వాపు వచ్చింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలర్లను రిషబ్ చాలాసేపు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.
ఈ ఒక్కటే కాకుండా తర్వాత చాలా బంతులు పంత్ శరీరానికి బలంగా తాకాయి. అయినప్పటకి రిషబ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 40 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
Rishabh Pant facing some serious punishment from the Australian bowlers. Taking some heavy blows. #AUSvIND #Rishabpant #BorderGavaskarTrophy #ToughestRivalry https://t.co/QiLSnpRbYE
— 𝕊𝕙𝕒𝕙𝕚𝕕 𝕌𝕝 𝕀𝕤𝕝𝕒𝕞 (@Shahid_shaban) January 3, 2025
Comments
Please login to add a commentAdd a comment