
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా(India-Australia) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22) రాణించారు.
భారత బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఇక ఆసీస్‌కు తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఆసీస్ స్టార్ ప్లేయర్ ఉస్మాన్ ఖావాజాను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.
పంత్ భారీ సిక్సర్..
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(Rishabh Pant) విరోచిత పోరాటం కనబరిచాడు. విరాట్ కోహ్లి ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతులు బుల్లెట్‌లా తన శరీరానికి తాకుతున్నప్పటకి పంత్ మాత్రం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఈ క్రమంలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ బౌలింగ్‌లో రిషబ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. అతడు కొట్టిన షాట్ పవర్ బంతి ఏకంగా సైడ్‌స్క్రీన్‌పై చిక్కుకుపోయింది. దీంతో ఆ బంతిని తీసేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. నిచ్చెనను తీసుకువచ్చి మరి ఆ బంతిని కిందకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
A six so big the ground staff needed a ladder to retrieve it!#AUSvIND pic.twitter.com/oLUSw196l3
— cricket.com.au (@cricketcomau) January 3, 2025