జిమ్నాస్టిక్స్‌తో ఇరగదీస్తున్న పంత్‌ | Rishabh Pant Gymnastic Video Goes Viral In Hotel AHead Of Sydney Test | Sakshi
Sakshi News home page

జిమ్నాస్టిక్స్‌తో ఇరగదీస్తున్న పంత్‌

Published Tue, Jan 5 2021 6:48 PM | Last Updated on Tue, Jan 5 2021 9:32 PM

Rishabh Pant Gymnastic Video Goes Viral In Hotel AHead Of Sydney Test - Sakshi

మెల్‌బోర్న్‌: టీమిండియా యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ జిమ్నాస్టిక్స్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా పంత్‌ మంగళవారం తన జిమ్‌ సెషన్‌కు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. గుడ్‌ డే ఎట్‌ ద ల్యాబ్‌ అని క్యాప్షన్‌ జత చేశాడు. ఆ వీడియోలో పంత్‌ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందరిలా కాకుండా పంత్‌ కాస్త విభిన్న రీతిలో కసరత్తులు చేశాడు. తన చేతులను కిందకు.. కాళ్లను పైకి లేపుతూ మూడు పల్టీలు కొట్టిన పంత్‌ అనంతరం డంబుల్స్‌తో వినూత్న రీతిలో కసరత్తులు చేశాడు. కాగా మూడో టెస్టుకు తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి పంత్‌ బాగానే కష్టపడుతున్నాడు.


అయితే న్యూ ఇయర్‌ రోజున రోహిత్‌, నవదీప్‌, శుబ్‌మన్‌ గిల్, రిషభ్‌ పంత్, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలు మెల్‌బోర్న్‌లో హోటల్‌కు బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే రెస్టారెంట్‌లో వీరు తిన్న ఫుడ్‌కు ఒక అభిమాని బిల్లు చెల్లించి దానిని వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. అయితే బిల్లు చెల్లించిన అభిమానిని పంత్‌ హగ్‌ చేసుకున్నట్లు వార్తలు రావడంతో వివాదాస్పదమైంది. టీమిండియా ఆటగాళ్లు నిబంధనలు ఉల్లఘించారంటూ ఆసీస్‌ మీడియా కథనాలు రాసింది. దాంతో వారందరిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి కరోనా టెస్టులు నిర్వహించగా అందరికి నెగెటివ్‌ అని తేలడంతో వివాదం సద్దుమణిగింది. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 7వ తేదీన సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.(చదవండి:  పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్‌ ఏంటంటే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement