ఆంబ్రోస్ చెబితేనే ఆడారు
ముంబై: తమ దేశ క్రికెట్ బోర్డు వ్యవహార శైలితో విసిగిపోయిన వెస్టిండీస్ జట్టు భారత్‌తో నాలుగో వన్డేను ఎట్టి పరిస్థితిల్లోనూ ఆడకూడదని నిర్ణయించకుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశానికి ఆలస్యంగా రావడమే కాకుండా గురువారం ప్రాక్టీస్‌కు కూడా రాలేదు. విషయం తెలుసుకున్న బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఎంత బతిమాలినా కూడా వారు వినలేదు. అయితే ఈ దశలో విండీస్ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న కర్ట్‌లీ ఆంబ్రోస్ రంగప్రవేశంతో సీన్ మారింది.
అర్ధగంట సేపు డ్వేన్ బ్రేవో బృందంతో మాట్లాడి ధర్మశాల వన్డేను ఆడించేలా ఒప్పించారు. ఇక్కడిదాకా వచ్చి మ్యాచ్‌కు దూరమైతే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం సన్నాహకాలు దెబ్బతింటాయని, మ్యాచ్ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫర్లేదని సూచించారు. దీంతో వెనక్కితగ్గిన ఆటగాళ్లు అందుకు సమ్మతించారు.