బీసీసీఐని కోరిన వెస్టిండీస్
జమైకా: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగినందుకు నష్టపరిహారం చెల్లించే విషయంలో... తమకు రెండు నెలలు సమయం కావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత బోర్డు (బీసీసీఐ)ని కోరింది. మధ్యవర్తిత్వం ద్వారా లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు నెలల్లోపే ఈ సమస్యను ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డు అధ్యక్షుడు కామెరాన్ బీసీసీఐకి లేఖ రాశారు. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.
2 నెలలు సమయం ఇవ్వండి
Published Thu, Jan 29 2015 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM
Advertisement
Advertisement