కోల్‌కతా: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) చెల్లించాల్సిన నష్ట పరిహారంపై త్వరలోనే వారి అధికారులతో చర్చలు జరపనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తెలిపారు. గత అక్టోబర్‌లో భారత పర్యటనలో ఉన్న విండీస్ జట్టు తమ బోర్డుతో ఏర్పడిన విభేదాల కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి పయనమైంది. దీంతో తమకు నష్టపరిహారంగా 41.97 మిలియన్ డాలర్ల (రూ.269 కోట్లు)ను చెల్లించాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. ‘క్రికెట్ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని ఆశిస్తున్నాను. వర్కింగ్ కమిటీలో కూడా గతంలో ఇదే విషయం చర్చించాం’ అని దాల్మియా అన్నారు.
త్వరలోనే ‘విండీస్’ సమస్య పరిష్కారమవుతుంది: దాల్మియా
Published Fri, Jun 5 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement