50 చేసినా... మనమే గెలిచాం | India Women Team Win Fourth T20 Against West Indies | Sakshi
Sakshi News home page

50 చేసినా... మనమే గెలిచాం

Nov 19 2019 3:47 AM | Updated on Nov 19 2019 3:47 AM

India Women Team Win Fourth T20 Against West Indies - Sakshi

ప్రావిడెన్స్‌ (గయానా): విండీస్‌ గడ్డపై భారత్‌ మహిళల జట్టు విజయగర్జన కొనసాగుతోంది. ఇప్పటికే ఎదురులేని విజయాలతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ నాలుగో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ జట్టును కంగుతినిపించింది. చిత్రంగా కేవలం 50 పరుగులే చేసినా...  ప్రపంచ చాంపియన్‌ జట్టుపై టీమిండియా గెలుపొందడం విశేషం. వర్షంతో ఈ 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 9 ఓవర్లలో 7 వికెట్లకు 50 పరుగులు చేసింది. పూజ పది పరుగులే టాప్‌ స్కోర్‌! హేలీ మాథ్యూస్‌ 3, అఫీ, షెనెటా చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన విండీస్‌ 5 పరుగుల దూరంలో నిలిచింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లకు 45 పరుగులే చేయగలిగింది. హేలీ 11, హెన్రీ 11, మెక్‌లీన్‌ 10 పరుగులు చేశారు. విండీస్‌ గెలిచేందుకు చివరి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా... అనూజ వేసిన ఆఖరి ఓవర్లో విండీస్‌ 7 పరుగులే చేసి 2 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో అనూజ పాటిల్‌ (2/8) రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ (1/8), రాధా యాదవ్‌(1/8)లకు ఒక్కో వికెట్‌ దక్కింది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4–0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌... గురువారం ఆఖరి మ్యాచ్‌ను ఇదే వేదికపై ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement