Pak Vs Ban 1st T20I: Pakistan Beats Bangladesh By 4 Wickets - Sakshi
Sakshi News home page

PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది

Published Fri, Nov 19 2021 5:32 PM | Last Updated on Fri, Nov 19 2021 9:01 PM

PAK vs BAN: Pakistan Beat Bangladesh By 4 Wickets 1st T20I Match - Sakshi

Pakistan Beat Bangladesh By 4 Wickets 1st T20I.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20లో పాకిస్తాన్‌ ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. అయితే ఒక దశలో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ మ్యాచ్‌ గెలుస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే ఫఖర్‌ జమాన్‌(34), కుష్‌దిల్‌ షా(34) మంచి ఇన్నింగ్స్‌ ఆడడంతో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ గాడిలో పడింది. కాగా స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడంతో మరోసారి ఉత్కంఠ పెరిగింది.

చదవండి: MS Dhoni: సాక్షి ధోని బర్త్‌డే వేడుకలు.. అదరగొట్టిన ధోని

అయితే షాదాబ్‌ ఖాన్‌(21 నాటౌట్‌), మహ్మద్‌ నవాజ్‌(18 నాటౌట్‌)లు బంగ్లాకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 2, షోరిఫుల్‌ ఇస్లామ్‌, మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ హసన్‌ అలీ దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అసిఫ్‌ హొస్సేన్‌(36), మెహదీ హసన్‌(30 నాటౌట్‌), నురుల్‌ హసన్‌(28) పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ 3, మహ్మద్‌ వసీమ్‌ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్‌ 20న జరగనుంది.

చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్‌ కెప్టెన్సీకి రాజీనామా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement